పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

సౌగంధిక ప్రసవాపహరణము



నలసతచేఁ జూచి యలుకుచు కీఁచు[1]
పలుకుల నిట్లనుపాండునందనుని
నీ వెవ్వరో యయ్య నీకుఁ బే రేమి?
యేవస్తువులకు నీ వేఁగుదెంచితివి?
గరిమెతో నీమోము గనుఁగొన్నయపుడె 1655

సొరిది నాతమ్మునిఁ జూచిన ట్లాయె‌;
నింతింత యని మది నెన్నంగరాని
సంతోష మందితి జనపాలచంద్ర!
బడలి కెల్లను దీరె భయములు దారె
నడలు ధైన్యము మాసె నాఁకలి పానె 1660

తత్తరంబు దొలంగె కాల్మి చెలంగె
చిత్తంబు జిగురించె చెలువంబు మించె
తపమెల్ల ఫలియించె ధన్యుండనైతి
నృపచంద్ర ! దైవంబు నినుఁ జూవె మాకు 1665
మేదినీవల్లభ మీస్వరూపంబు

నాదిగర్భేశ్వరునట్లు గన్పించె

  1. కీలు, పలుకుల నిట్లను (ట. త>)