ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
157
వలనొప్పఁగా చక్రవర్తిచిహ్నములు
తొలఁగక నీయందు దోచుచున్నవియు
నిన్నియుఁ గల్గి నీ వెవ్వరు లేక
ని న్నగపంక్తుల నీయరణ్యముల 1670
జడియక యీనిశీసమయంబునందు
కడు నొంటిగాఁ జన కారణం బేమి?
నీరాజసంబును నినుఁ జూడలేక
యీరీతి బనుపువా రెవ్వరు నిన్ను[1]
మనుజాధినాయక మముబోంట్లకైన 1675
నిను గనుఁగొన్నను నెనరు బట్టెడిని
తెలియంగ నిదొ దొడ్డదేవతాభూమి
మలసి చూచిన నీవు మానవరూవు
చండపంచానన శరభశార్దూల
గండభేరుండము ల్గల వెల్లయెడల, 1680
- ↑ నిత్తరి యొకవార్త విన్నవిచెదను చిత్తావధానివై చెవియొగ్గి నినుము ......... ......... ........ ...... థారుణి నిర్దయదాక్షీణ్యు లగుచు