పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

155



మేదినీరుహ చర్య! మిక్కిలి నీకు1635
ఈదైన్య మీభయం బెటువలెఁ గల్గె?
అదిగాక శతవృద్ధవైతి వీ వింక
కొదువ వస్తువు లేమికోరెద విపుడు
పనిఁబూని నేవచ్చు పయనంబు మాని
గొనకొని నీను గనుంగొనినది మొదలు1640

మాయన్న నీమీఁద మమత పుట్టెడిని[1]
యీయున్న విధము నీవింతయుఁ దెలుపు
మనీ సారె సారెకు యడలించి పిలువ
వినియును నొక్కింత విననిచందమునఁ
గనియును లేశంబు గననిమార్గమున1645

తనుదానె ప్రక్కలు తలగీరికొనుచు
విప్పుగా రెప్పలు నిప్పించి నవ్వి
తప్పి వ్రాలినబొమ ల్దాల్మి నిక్కించి
పెదవులు నట్టిట్టు బెట్టుగాఁ జెదరి
పదరిచిందులుద్రొక్కి పండ్లూగులాడ1650

  1. మాయన్న నీమీద మర్లుబుట్టెడిని (ప, ట)