పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

సౌగంధిక ప్రసవాపహరణము




అలఘుబలోద్దండుఁ డాంజనేయుండు
ఆపాండుసుతుఁ డడ్డమాఁగయులేక[1]

భీముఁడు హనుమంతునిఁ జూచుట

నేపున జనుదేర నెలమి గట్టెదురు
నడలుచు వణకుచు నరచుచు నిట్లు
బడియున్న వనచరు భావించి చూచి
కరుణాకటాక్షమాఘునునిపై నునిచి
పొరిపొరి మేనెల్ల పుణికి చూచుచును1630
వెరవకు మని చీరి వెన్ను చే జరచి
యిరుమైల నడలించి యిట్లని పలికె[2]

భీమహనుమంతుల సంవాదము

అనఘాత్మ! నీ వెవ్వరయ్య! యిచ్చోట
కనుమూసి డియున్న కారణం బేమి

  1. 1 (a ) ఆపాండుసుతు డడ్డ మాగెయులేక (ప)
    (b) ఆపాండుసుతు డడ్డమాజ్ఞయులేక (త)
  2. (a) యిరవంద నదలించి యిట్లని పలికె (క)
    (b). యిరువందఁగాహెచ్చరించి యిట్లనియె (త)