పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడిమి విద్యల జూపుగారుడసాని[1]

వడువున చంద్రికావైఖరు ల్వెలసె[2]
  1. (1) కడిమి విద్యలు జూపుఁ గారడిగాని
    (2) కడిమి విద్యల చూపు గారడసాని
    (3) కడిమివిద్యలు జూపు గారుడవాని
  2. వరుస నారదమునివరులెల్ల నవ్వ
    శరనిధులటు సుధాజలరాశి గెరల
    తరుచైన యఖిలభూతములు సహింప
    లరిధరాజములు కల్పకము నెగ్గింప
    కరమర్థి నదులు గంగను నెరిగింప
    తరణులెల్లను శారదను జుల్క సేయ
    ఖగములు హంసల గదుముచు దిరుగ
    మృగములు సింగంబుమీఁద దండెత్త
    కమలాక్షి కమలాంక కమలసంభవులు
    మమతతో సతుల నేమరకుండఁ జేయ
    కడు దానెయౌ మహాగారడసాని
    వడువున చంద్రికావైఖరుల్ వెలసె