పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

147



మలయమారుతవర్ణనము

మలయాద్రిచెంత నెమ్మది నుద్భవించి1535
పొలుపొందు మల్లెపూఁబొత్తుల బొరలి
యొనరు పూఁదేనియ యుగ్గున బెరిగి
పనుపడ నునుమంచు బాల నీడేరి
వరుస నానాసూనవాసన లాని
శరజాకరముల ముచ్చట నోలలాడి[1]1540
కపురంపుఁదిన్నెలఁ గడువినోదించి
విపులమౌ చందనవృక్షంబు లెక్కి
యొగి కల్పలతలతో నుయ్యాల లూగి
జగిమించు తేటితేజి నెక్కి నిక్కి[2]
పంచధారాగతు లుపన్యసింపుచును1545
నంచల నంచల నటు దువాళించి
చెలఁగుచు నొకవీథి చేవాగెసడలి
తొలఁగనీక కుదించి దుమికించుకొనుచు

  1. సరసులయందు ముచ్చట నోలలాడి
  2. జగిమించు లేడి తేజి నెక్కి నిక్కి