పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

139

అని యని వగచి హా యని విలపించు
ననఁబోణి గాంచి దానవనాథు డనియె
వెరవకు మాతల్లి! వెరవకుమమ్మ !
వెరపు నీ కేటికి విక చాబ్జవదన !
రహిదూరదృష్టి దూరశ్రవణములు
మహితమాయోపాయమర్మ కర్మములు 1450
వరుస ననాగతపర్తమానములు
కరతలామలకముల్ కలకలరి నాకు
న న్నెఱుంగక యుండ నసుఁగన్న తండ్రి
కిన్ని బాధకములు ఏటికి వచ్చు ?
నపజయశమనంబు లయినవి యెల్ల 1455
చపలాక్షి మనకు విజయ మని తలఁపు

ఘటోత్కచుని సాంత్వనము.


ఇంతుల కెడమక న్నీగ మొత్తినను
నెంతయు శుభమగు నిందుబింబాస్య
కొత్తగాయంబులఁ గుందుచు విభుఁడు[1]

  1. కొత్తగాయములలో కొతుకుచు విభుఁడు
    హత్తి నిల్చినయట్టు లయినది వినుము
    యదువంశకలిత క్షీరాబ్ధిచంద్రుండు
    పరమదయాళుండు భక్తవత్సలుఁడు
    కరిరాజవరదుండు కపటనాటకుఁడు
    భవరోగవైద్యుఁ డాపద్బాంధవుండు
    రవికోటితేజుఁ డార్తశరణ్యమూర్తి
    మన్మథజనకుండు మదవిభేదనుఁడు
    చిన్మయుం డాదిలక్ష్మీనాయకుండు
    కరుణతో మనపాల గలుగు నన్నాళ్లు
    సరసిజానవ యపజయ మేల కల్లు (త),