పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

121

అన విని చింతించి యనిలనందనుఁడు,
తనమదిలోఁ గొంత తడవు చింతించి, 1185
చలపట్టి వదలదు జలజాయతాక్షి
తొలగఁగూడదు బహుదుర్ఘటం బాయెఁ!
గొరగానిసంగతి గూడి నే నిట్లు
ఇరుకున జిక్కితి నే మనవచ్చుఁ !
గొనకొని తాఁ జేసుకొన్నంత తానె 1190
యనుభవింపకతీర దజునకునైన,
గురుతుగా మెడఁజుట్టి కొన్నట్టిపాము
గరువక విడుచునే కటకటా.యింక !
కావలియై యింతి కడనుండ నెనరు ,
దేవప్రసూసము ల్దెచ్చువా రెవరు? 1195
వనజాతములఁ జూపు వార లెవ్వారు?
అనుచు వితర్కించు నాసమయమునను

నారదాగమనము.


శ్రీకాంతుచరితముల్ చెలగు వేడుకల [1]

  1. శ్రీకాంతుచరితలంచితవైభవమున (2421, 4502)