పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

సౌగంధిక ప్రసవాపహరణము

ప్రాకటజంత్ర గాత్రముల బాడుచును
జడలు దూగంగ బొజ్జనటింపుచుండ[1] 1200
వడిగ రుద్రాక్షతావళము[2] లల్లాడ
కరకమండలనీరకణములు చింద
సరసిజాసనుసూతి చనుదెంచుటయును ;
గని వధూవరులు జక్కఁగ నెదురెఁగి
ఘనభక్తి మ్రొక్కి వేడ్కలను పూజించి, 1205
వినుతులు గావించి వినయము ల్సేసి
జననాథసూను డాసంయమి కనియె
సురమునిరాజు భాసురరవితేజ

నారద భీముల సంభాషణము.


పరమదయాస్వాంత పటుసత్యవంత
మునుపు నేవనమార్గమున వచ్చునపుడు 1210
వనజాతపాణికి వర మిచ్చినాఁడ
నిందుబింబానన యిపు డిటువంటి

  1. జడలు దూగెడ బొజ్జనటెంపుచుండ (2421, 4502)
  2. తావడము (2421, 4502)