పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటక ప్రదర్శనము

31


అల్పాయుష్యము నాతనినుదుట వ్రాసిన యా బ్రహ్మలేఖనమును బెరుమాళ్లసెట్టి పెన్సిలుతోఁ గొట్టివైచియీభూలోకబ్రహ్మ పూర్ణాయుష్యమును గటాక్షింపలేదా?జగత్సృష్టి కర్తయగు బ్రహ్మమాట యెవరియొద్దనైన సాగును గాని గ్రంథసృష్టికర్తయగు కవిబ్రహ్మయొద్ద సాగునా?తనయిష్టమే యిష్టము! తనమాటయే మాట! తన ప్రాంతయే వ్రాఁత! నిరాఘాటవచః పాటవసంపన్నుఁడు. నిరంకుశ క్రియాచరణదీక్షాదక్షుఁడు. పుట్టనివారినిఁ బుట్టించును. గిట్టనివారిని గిట్టించును. గిట్టినవారిని బ్రదికించును. సృష్టిచక్రము నిట్లు సవ్యాపసవ్యములతో జోక్యము లేకుండ నిష్టానుసారముగఁ ద్రిప్పుచుండును. బ్రహ్మాదిదేవత లతనికలమునకు బదులు తన నాటకపాత్రములలో నెవ్వరికైన నసాధ్యకష్టావసరము సిద్ధించునెడలఁ దన యిష్టానుసారముగ నేదైన నొక్కదేవతను జెవులు నులిపి ప్రత్యక్షపఱచి యానాటకపాత్ర మహాకష్టము లన్నియు మంచు విడిపోయినట్లు చేయును. యోగాభ్యాసమునకు, మహాతప స్సునకు, భక్తి విజ్ఞానములకు లొంగని దేవతలంద ఱితని బాతుటీఁక కధీనులయియుందురు. ఈతని మనస్సు మిక్కిలి కనికరము గలది. నాటకాంతమున నెవ్వరిని గష్టములలో నుంచఁడు. యథోచితముగ నందజ కేదియో యొక్క సాహాయ్య మాచరించి వారియిడుము లను గడపి మఱి రంగమునుండి పొమ్మనును గాని కష్టముల నెత్తినెత్తికొని, చింత హృదయమునఁ గట్టుకొని, కంట నీరు పెట్టుకొనిమాత్రము పొమ్మఁనడు. చరిత్రకు విరోధ మని జంకఁడు. సత్యమునకు దూరమేమోయని సందేహింసఁడు. ప్రకృతినైజమునకు వ్యతిరేక మేమో యని టొంకఁడు. ప్రాపంచికవైఖరికి భిన్నమేమో యని తటపటాయించండు. క్రిందిభూమినిఁ బై కెగఁ ద్రోచియో, పైయాకాశమును గ్రిందికి లాగియో, మనుష్యులకు నాకాశగమన మిచ్చియో, పక్షులకు వచన రచనాపాండిత్య మిచ్చియో, పశువులకు బ్రబలధిష ణాచణత్వ మిచ్చియో, కనఁబడని దేవతలఁ గానఁబఱచియో యేదియో ప్రళయోద్దండమగు నొకపన్నుగడఁ బన్ని పర్యవసానమునఁ బాత్రలకు ద్రష్టలకుఁ బరమానంద మిచ్చును. ఇచ్చి తీరును. అన్యథా యెన్నఁడఁ జేయఁడు.

కవి కింతనియమ మెందులకు? ప్రకృతి ననుసరించి పోవలసిన యాతఁడు భరతవాక్య మాంగళ్యమునకై ప్రాకులాడ నేల? ఇది చిత్రముగనే యున్నది. అవనిలో నందఱచరిత్రము లానందపర్యవసన్నములేనా? లోకమునఁ గన్నులు లేనివా రెందజఱు! కాళ్ళు చేతులు లేనివారెందఱు!నపుంసకు లెందఱు! అల్పబుద్ధులెందఱు! పశుప్రాయు లెందఱు! భర్తలచే నిష్కారణముగ విడనాడఁబడిన వనిత లెందఱు! భార్యలు పెట్టిన విషయముచేఁ జచ్చిన భర్త లెందఱు!ధూమశకట మయోమార్గమునుండి దొరలిపోవుటచేఁ దలలు పగిలి, కాళ్లుచే తులు తెగి, చర్మము లూడిపోయి, సంధులు విఱిగి పొడియై రక్తమున ముద్దలై నామరూప ములు లేకుండునట్లు భయంకరమరణము లొందినవా రెందఱు!మహాక్షామములందు నన్నము లేక, కాయ గనరు లేక, త్రాగ మంచినీరు లేక, చింతయంబలి త్రావి, రేగడమంటిబురద ద్రావి, యదియును లేక కడుపు మాండిపోవ, పస్తుపడి నకనకలాడి, యస్థిపంజరములై, మహావ్యాధిపీడితులై, శవస్వరూపములఁ దాల్చి, సశువులవలే గడ్డి తినుటకయినఁ దలపడిన నదియును దొరకక ❝యలో❞ యనుచు, నేడ్చి, తమ రక్తమును దాము ద్రావి, తమ పచ్చినూంసమును దాము తిని, గుండె లార్చుకొనిపోవఁ, గన్నులు లొట్టలువడఁ, గడుపులు వెన్ను నంటఁ, గాళులు లబలబలాడఁ, గడుపులు నింపుకొనుటకయి కన్నబిడ్డలను గాల్చుకొని తినుటకు సిద్ధమయి దిక్కుమాలిన ప్రాణము లెంతకును బోక, ❝చావో చావో❞ ,