పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

3


క.

జగదుపకారార్ధము క్రొ
త్తగ లక్షణలక్ష్యములు వితర్కించి బుధుల్
పొగడఁగఁ గృతిఁ జేసెద నెర
వగు లక్షణసారసంగ్రహాహ్వయ మొనరన్.

8


గీ.

తెలుఁగునకు మున్ను లక్షణంబులు మహాక
వీశ్వరులు పెక్కు రచియించి యిడిరిఁ కేల
గూర్పవలెనన్నఁ బ్రౌఢిమకొఖక నాకుఁ
దెలిసినతెరంగు నొకకొంత తేటపఱుతు.

9


క.

నన్నయభట్టాదులు గృతు
ల న్నిలిపినలక్ష్యములును లక్షణములు యు
క్తి న్నెమకి కృతి యొనర్పుచు
మున్నుగ నాంధ్రంబుచందము న్వివరింతున్.

10


క.

కరతలధృతసారంగా
చిరతరకరుణాంతరంగ సింధునిషంగా
కరిదైతేయవిభంగా
గురుతరగోరాడ్తురంగ కుక్కుటలింగా.

11


వ.

అవధరింపుము.

12


ధాత్రిపై దత్సమంబును దద్భవంబు
నచ్చతెనుఁగును దేశ్య గ్రామ్యంబు నాఁగఁ
దెల్లమగు నైదుతెఱఁగులఁ దెనుఁగుబాస
దనపుఁ దద్విధ మెఱిఁగింతు విను మహేశ.

13


గీ.

హరుఁ డనంగ హరి యనంగ గురుఁ డనంగ
గురు వనఁగ నంబ యనఁ మహేశ్వరి యనంగఁ