పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

మంజువాణి


క.

చిరభక్తి న్బొగడెద మ
ద్గురునాథుని చెందులూరి కులపాననుని
న్గరుణానిధి నపరాంతక
హరమూర్తిని ఘనుని లింగనారాధ్యమణిన్.

4


గీ.

నన్నపార్యుని శ్రీనాథు నాచిరాజు
సోము నమరేశుఁ దిక్కన సోమయాజి
శంభుదాసుని భీము భాస్కరుని మఱియు
గణుతి కెక్కిన సుకవిపుంగవులఁ దలఁతు.

5


వ.

అనియిష్టదేవతాప్రార్థనంబును వాణీగణేశ్వరస్తవంబును గురుచర
ణస్మరణంబును మహాకవివర్ణనంబునుం గావించి.

6


సీ.

కౌండిన్యగోత్రవిఖ్యాతుఁడ కూచిమం
                  చ్యన్వయాంభోధనీహారకరుఁడ
గంగనమంత్రిశేఖరునకుఁ బరమపా
                  వనియగులచ్చమాంబకును సుతుఁడ
వెరవొప్పురుక్మిణీపరిణయంబును సింహ
                  శైలమాహాత్మ్యంబు నీలపెండ్లి
కథయును రాజశేఖరవిలాసము నచ్చ
                  తెనుఁగురామాయణంబును మొదలగు


గీ.

కృతులు రచియించి పార్వతీపతికి భక్తి
తోడ నప్పన మొసఁగినవాఁడఁ గంద
రాడపురసంస్థితుఁడఁ గడుఁబ్రోడ నేను
దిమ్మకవిచంద్రుఁడను జగద్వినుతయశుఁడ.

7