పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పాటలు వ్రాసియిచ్చియుండిన దగుటంజేసి యాపాట లెల్లఁ దత్వమునే బోధించుచున్నవి. ఈమె కవిత్వకల్పనాశక్తి వేంకటాచలమాహాత్మ్యమునందు వసంతఋతువర్ణనంబును, ఎఱుకచెప్పు పట్టునందును, మఱి యందందు మృదుమధురశైలితోఁ దత్వార్థంబులు సందర్భోచితముగ నెలకొల్పి కవన మతికఠినముగాక పదలాలిత్య మొప్పార వ్రాసినది. కవిత్వమునం దక్కడక్కడ నల్పదోషంబులు గానవచ్చుచున్నవిగాని, స్త్రీ యిట్లు రచించియుండుటకు నెంతయు సంతసింపవలయును గదా!

ఇదియునుంగాక నాచేత నొక గుజిలీయంగడిలోని వేంకటాచలమాహాత్మ్యపుస్తకమునిచ్చి పరిశోధించి వ్రాయుమని, శ్రీ వావిళ్ల వేంకటేశ్వరులుగారు చెప్పినందున నేనియ్యకొని నాశక్తికొలఁది, పద్యములలో నందందు విడిచినపదంబులను గూడినంతవఱకుఁ గూర్చి వ్రాసితిని. గుణగ్రాహ్యులగు పండితులు సంతసింతురుగాత.

ఇట్లు,

ఆలూరు వాసుదేవయ్య