పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శ్రీరమా పరిణయము

వరపూజ


విని, తన పరివార - వితతులతోడఁ
దనరార శోభన - ద్రవ్యముల్ గొనుచు
దొరకొని మంగళ - తూర్యముల్ మొరయ 130
నరుదుగా దార పు - త్రాదుల తోడ
నలువొప్పఁ దరిగొండ - నరసింహుఁడైన
సలలిత వేంకటా - చల నివాసునకు
హెచ్చిన భక్తితో - నెదురుగా వచ్చి,
యచ్చుగాఁ దగు పూజ - లచటఁ గావించి,
అందుండి బ్రహ్మరు - ద్రాదులతోడ
పొందుగా హరి నాత్మ - పురమున కపుడు
తోడుకొని పోయి బం - ధుజనంబుతోడ
విడుదులలో నుంచె - వేడ్కతో నంత.
సహజ లీలలఁ బరి - చారకుల్ చెలఁగి 140
రహిమీఱఁ బచ్చతో- రణములతోడ
[1]మురువంపు ముత్యాల - మ్రుగ్గులతోడ
దఱుచైన [2]వివిధ చి - త్తరువుల తోడఁ
గ్రమముగా నగరు శృం - గారంబు చేసి
విమలమౌ కల్యాణ - వేదిక నిండఁ

  1. మురువొప్ప - పూర్వముద్రిత పాఠము
  2. వింత చిత్తరువులతోడ - పూర్వముద్రిత పాఠము