పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

7

పెండ్లి పయనము


'పనిఁబూని శంకర బ్రహ్మాదులార! 110
పెనుపొందఁగాను నా - పెండ్లికి మీరు
పరఁగ మీ మీ కుటుం - బంబులతోడ
సరగున రమ్మన్నఁ - జని వార లపుడు
తమతమ సతులతో -దమ కుమారులతొఁ
దమ తమ పరివార - తతులతో మగిడి
వచ్చిన, వారితో - వరలగ్నమందు
హెచ్చుగా విహగేంద్రు - నెక్కి యచ్యుతుఁడు
సరవి ననంత, వి - ష్వక్సేన ముఖ్య
పరివారవితతి స - ద్భక్తితోఁ గొలువ
ముదమొప్ప విఖనస - ముఖ్య [1]సన్మునులు 120
విదితంబుగాఁ బరి - వేష్టించి పొగడ,
హర, విరించి, సురేశ్వ - రాదులు చెలఁగి
విరివిగాఁ బద్మాక్షు - వెనువెంటఁ జనఁగ
వరుసగా ఘనశుభ - వాద్యముల్ మొరయఁ
దఱుచైన మంగళ - - ద్రవ్యాళితోడఁ
జని చని యాక్షీర - జలరాశి చెంత
ఘనముగా నిలిచె; నా - క్రమము సాగరుఁడు

  1. సంయములు - పూర్వముద్రిత పాఠము.