పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxiv

7. సూరయవేంగనగారి రామరాజీయమున చక్రబంధ శార్దూలము , నాగబంధ చంపకమాల, గోమూత్రీకాబంధకందము, చతుశ్చరణ గర్భకందము , ద్వికంద గర్భక్రౌంచపద వృత్తము, నవగ్రహాష్ట దిక్పాలక దశావతారనామ గర్భకందము.

8. కూచిమంచి తిమ్మన్న గారి రసికజనమనోభిరామమునందుఁ గందమణిగణ నికరవృత్తము సగర్బ స్రగ్విణీ భుజంగప్రయాత ద్రుతవిలంబిత వృత్త సీసము సగర్భమత్తేభకంద సీసము.

9. పిండిప్రోలు లక్ష్మణకవిగారి లంకావిజయమున నాగబంధ స్రగ్ధరా వృత్తము, కందమణి గణనికరవృత్తము, చతుర్విధ కందము, పుష్పగుచ్చ స్రగ్ధరా వృత్తము, ఉభయభాషాకందము.

10. అడిదము సూరన్న కవిజనరంజనము నందుఁ జతుర్విధ కంద గర్భిత మణిగణనికరవృత్తము, చతుర్విధ కందగర్భిత ప్రమితాక్షరవృత్తము.

11. సుబ్రహ్మణ్య విజయమను విద్వత్కర్ణామృతమున చిత్ర గర్భిత వచనములో సీసగర్భిత పాదము, పుష్పమాలికాబంధ భాగము, నాగబంధ భాగములోనగునవియు, ముక్తపదగ్రస్త కందద్వయ గర్బిత చంపకమాలికా నాగబంధము, శైలబంధకందము, మణిగణనికరగర్బిత కందము, భుజంగ ప్రయతగర్బిత స్రగ్విణి, తరువోజ సమపాదోత్సాహవృత్తావతంస భుజంగ ప్రయాత స్రగ్విణీవృత్త ద్విపదమంజరీగర్భిత దండకరూప చిత్ర సీసానుచర చతురంగతురంగ సకలగృహవార ప్రచార దేశిక చిత్రగీత సీసము, మణిగణనికర గర్బితకంద పుష్పమాలికాబంధము, కాంభోజీరాగ పదగర్భిత చిత్రసీసము, సహనాఖ్యరాత పదగర్బిత సీసము, ముఖారిరాగ పదగర్బిత సీసమాలిక, ఆనంద భైరవిరాగ కీర్తనాగర్బిత సీసము, ముఖారిరాగ పదగర్భిత సీసమాలిక, చతుర్థ పాద గోపనకందము.

12. బహుజనపల్లి సీతారామచార్యులవారి సుందరరాజ శతకమునందు ఖడ్గబంధకందము.

13. మచ్చ వేంకటకవిగారి శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచనకుశరాట్చరిత్రమునందుఁ బుష్పబంధ చంపక మాల, కందగర్భ చంపక మాల.