పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

89


క. కాయంబులు గాయములై
   యాయంబులు పగుల మిగుల నాయంబులచేఁ
   దోయంబుల టింకిని బలు
   తోయమ్ముల మృగకులమ్ము దూలించె వడిన్. 203

క. సామికిటికటము నేసిన
   యా ముత్తియమమ్ము సుదనయమ్మునం దనరె
   న్రాముని కృపగలగిన రఘు
   రాముని తూపుతుద నీటి రాజుండు వహిన్. 204

గీ. అంతట నిఖిలమృగయావిహారలీల
   సలుపుచును వచ్చి యాదైవసార్వభౌముఁ
   డఖిల పరిజన పరివృతుఁ డగుచు వేఁట
   సరవి చేయెండ సోఁకునఁ జాల బడలి. 205

యతి భేదము


సీ. మును పుష్యరాగంపు మొదల రక్కొని మించు
               వైడూర్యశాఖల పచ్చరాద
    డమ్ముసందుల పగడంపు సైకపు సుడి
               తలిరుల తుదల నిద్దపు సుపాణి
    మ్రుగ్గుల నొరయు క్రొమ్మూలఱా లిరులక
               డాని పుప్పొడి రాల్పడో నన వగ
    చిందు గోమేధిక సీధువునకు మూగు
               నింద్రనీలపుఱాతి గండుదేఁటి

గీ. మ్రోఁతలకు సొక్కు బంగరుపులుఁగు లెఱకు
    పలుమొనల చించు రతనంపు పండ్లవడియు
    రసము బ్రవహించు సెలయేటి యిసుము దిబ్బఁ గ
    లుగు చిత్రతరుచ్ఛాయ కెలనఁ జేరి. 206

క. అటు ముందట పటుశైత్యో
    ద్భటమయి దిటమయి నిగాఢ దళసంతతి వి