పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీ బ్రహ్మాబ్జాక్ష భూతేశేభ్యో నమః

శ్రీ మద్గురుబృందపాదార విందాభ్యాంప్రణతిః

శకున శాస్త్రము

శి ఖి న ర సిం హ శ త క ము

తాత్పర్యము

క. శ్రీయును, శుభమును, విభవము
   నాయువు నారోగ్యము.ను, మ§ హాయశమును మే
   ధాయుక్త భాగ్యమును, సు
   శ్రేయముఁ గృపసేయుమయ్య § శిఖినరసింహా.1

క. వెలయున్ సర్వదిగంతము
   లలరున్ , సామ్రాజ్యయుక్త § మైన యశశ్శ్రీ
   లలనావర! కరుణామృత
   చెలువము దయసేయు మాకు శిఖినరసింహా.2

తా. "ఓశిఖినరసింహా! సంపదలు, ఐశ్వర్యము, వైభవము,ఆయువు, ఆరోగ్యము, కీర్తి, మంచి యాలోచన, శుభమును దయసేయుము. నలుదిక్కు లందు వ్యాపించిన నీకీర్తియును, నీకరుణామృతమును మాయందుంచి గొప్పతనమును కలుగజేసి రక్షింపుము " అని గ్రంథకర్త అహోబలగిరి యందుండు శిఖినరసింహస్వామిని ప్రార్థించుచు స్వామి పేరిటి శకున శాస్త్రమును శతకముగా రచియించెను.