పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

(iii). కేంద్ర ప్రసార వినియోగముచే నిర్మించబడి, స్వామిత్వము కలిగియుండి, నడుపబడు, నిర్వహించబడు. లేక నియంత్రించబడు వ్యవస్థ ద్వారా రాజ్య క్షేత్రములో చేయబడు విద్యుచ్ఛక్తి ప్రసారం

చేరియుండును.

(37) “రాజ్యాంతర్గత ప్రసార వ్యవస్థ” అనగా అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ కానట్టి విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకైన ఏదేని వ్యవస్థ అని అర్థము:

(38) “లైసెన్సు" అనగా 14వ పరిచ్చేదము క్రింద మంజూరు చేయబడిన లైసెన్సు అని అర్థము;

(39). "లైసెన్సుదారు" అనగా 14వ పరిచ్చేదము క్రింద లైసెన్సు మంజూరు చేయబడిన వ్యక్తి అని అర్థము;

(40) "లైను” అనగా విద్యుచ్ఛక్తి సరఫరాను వినియోగించుట కొరకు రూపొందించిన లేక వాడబడిన (కేసింగు లేక కోటింగుతో కూడిన) ఏదేని వైరు, కేబులు, ట్యూబ్, పైపు, ఇన్సులేటర్, కండక్టర్ లేక అదే విధముగానున్న ఇతర వస్తువు అని అర్థము మరియు ఈ పదపరిధిలో ఏదేని లైనుకు చుట్టుకొనినున్న లేక ఆధారమిచ్చు లేక చుట్టుకొని యుండి లేక ఆధారమీయబడినట్టి ఏదేని లైను లేక అట్టి ఏదేని లైనుతో కూడివుండి, ఆ లైనుకు అతి సమీపములో నెలకొల్పబడిన లేక ఆధారమీయబడిన లేక , తీసుకొనిపోయిన లేక ఈ నిలిపివేయబడిన ఏదేని లైను చేరి యుండును;

(41) "స్థానిక ప్రాధికార సంస్థ” అనగా ఏదేని నగర పంచాయితీ, పురపాలిక కౌన్సిలు, పురపాలక కార్పొరేషను, గ్రామస్థాయి, మధ్యస్థ స్థాయి మరియు జిల్లా స్థాయిలలో " ఏర్పాటు చేయబడిన పంచాయితీ, ఓడ రేవు కమీషనర్ల నికాయము లేక న్యాయికముగా హక్కు కలిగిన లేక కేంద్రము లేక ఏదేని రాజ్య ప్రభుత్వముచే ఏదేని ప్రాంతము లేక స్థానిక నిధి యొక్క నియంత్రణ లేక నిర్వహణ అప్పగించబడిన ఇతర ప్రాధికార సంస్థ అని అర్థము;

(42) “మెయిన్" అనగా విద్యుత్ సరఫరా చేయబడిన లేక విద్యుత్ సరఫరాకు ఉద్దేశించ బడిన ఏదేని విద్యుత్ సరఫరా లైను అని అర్థము: -

(43) “సభ్యుడు" అనగా సముచిత కమీషను లేక ప్రాధికార సంస్థ లేక సంయుక్త కమీషను, లేక సందర్భానుసారముగ అప్పిలేటు ట్రిబ్యునలు అని అర్థము మరియు ఈ పదపరిధిలో అట్టి కమీషను లేక ప్రాధికార సంస్థ లేక అప్పిలేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ చేరియుండును.