పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (29) “ఉత్పాదన" అనగా ఏదేని ఆవరణలకు సరఫరా చేయుట కొరకు లేక అట్లు సరఫరా చేయుటకు వీలుగా ఉన్న ఉత్పాదన స్టేషను నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయుట అని అర్ధము;

(30) "ఉత్పాదన 'స్టేషను" లేక " స్టేషను" అనగా, ఏదేని భవనము మరియు " , స్టెప్-అప్ - ట్రాన్సఫార్మరు, స్విచ్ గేర్, స్విచ్ యార్డ్, కేబుళ్లు లేక అందునిమిత్తము వినియోగించిన ఇతర అనుబంధ సాధన సామాగ్రి, ఏదేని ఉన్నచో, వాటితో కూడిన మరియు అది ఉన్నట్టి స్థలముతో కూడిన ప్లాంటుతో సహా విద్యుత్ ఉత్పాదన కొరకైన ఏదేని స్టేషను అని అర్థము. ఉత్పాదన స్టేషనులో పనిచేయుచున్న సిబ్బంది నివాసము కొరకు వినియోగించిన ఏదేని భవనముతో సహా విద్యుచ్ఛక్తి ఉత్పాదన స్టేషను అని అర్థము మరియు జలశక్తి ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేసిన యెడల, ఇందులో పెన్ స్టాక్స, హెడ్ అండ్ టేల్ పనులు, మెయిన్ మరియు రెగ్యులేటింగ్ జలాశయములు, ఆనకట్టలు మరియు ఇతర హైడ్రాలిక్, పనులు చేరిఉండును. అయితే ఇందులో ఎట్టి సందర్భములోను, విద్యుత్ సబ్ స్టేషను చేరి ఉండదు;

(31) "ప్రభుత్వ కంపెనీ” అను పదబంధము కంపెనీల చట్టము, 1956లోని 617వ పరిచ్ఛేదములో దానికి ఈయబడిన అర్థము నే కలిగి యుండును;

(32) "గ్రిడ్' అనగా అంతర్గతంగా జోడించిన ప్రసార లైన్లు, సబ్-స్టేషను మరియు ఉత్పాదన ప్లాంట్ల ప్రధాన హైవోల్టేజీ ఆధార వ్యవస్థ అని అర్థము;

(33) "గ్రిడ్ కోడ్" అనగా 79వ పరిచ్ఛేదములోని ఉప పరిచ్చేదము (1) యొక్క ఖండము (హెచ్ క్రింద కేంద్ర కమీషనుచే నిర్దిష్ట పరచబడిన గ్రిడ్ కోడ్ అని అర్థము;

(34) "గ్రిడ్ ప్రమాణములు" అనగా ప్రాధికార సంస్థ చే 73వ పరిచ్చేదము యొక్క ఈ ఖండము (డి) క్రింద నిర్దిష్టపరచబడిన గ్రిడ్ ప్రమాణములు అని అర్థము:

(35) "హైవోల్టేజి లైను" అనగా ప్రాధికార సంస్థ చే ఆయా సమయము లందు నిర్దిష్ట పరచబడునట్టి విద్యుత్ లైను లేక నామ మాత్రపు వోల్టేజి గల కేబులు అని అర్థము

(36) "అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ " అను పదబంధ పరిధిలో,

(i) ఒక రాజ్య క్షేత్రము నుండి మరియొక రాజ్య క్షేత్రమునకు ప్రధాన ప్రసార లైను ద్వారా విద్యుచ్ఛక్తి సరఫరా కొరకైన ఏదేని వ్యవస్థ;

(ii) మధ్యలోనున్న రాజ్య క్షేత్రములో ఒకప్రక్క నుండి మరియొక ప్రక్కకు దానితో పాటు రాజ్యము లోపల విద్యుచ్ఛక్తి సరఫరా కోరకు అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి ప్రసారమునకు ఆనుషంగికమైన ఏడేని వ్యవస్థ;