పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థకు సంబంధించిన ప్రణాళిక మరియు సమన్వయము కొరకైన కృత్యములన్నియు నిర్వర్తించుట;

(సి) ఉత్పాదన స్టేషనుల నుండి లోడ్ కేంద్రములకు సాఫీగా విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట కొరకు సమర్థవంతమైన సమస్వయముతో కూడిన మరియు మిత వ్యయమగు అంతర్ రాజ్య ప్రసార లైన్ల వ్యవస్థను అభివృద్ధి చేయుట;

(డి) (i) ప్రసార ఛార్జీల చెల్లింపు పై ఎవరేని లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ; లేదా

(ii) కేంద్ర కమీషనుచే నిర్దిష్టపరచబడునట్టి విధముగా ప్రసార ఛార్జీలు మరియు వాటిపై సర్ ఛార్జీ చెల్లింపుపై 42వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్చేదము (2) క్రింద ఎవరేని వినియోగదారునికి రాజ్య కమీషనుచే అట్టి ప్రవేశసౌలభ్యము సమకూర్చబడినపుడు ఎపుడైనను,

తన ప్రసార వ్యవస్థను వినియోగించుట కొరకు విచక్షణా రహితమైన ప్రవేశ సౌలభ్యమును సమకూర్చుట ద్వారా,

కేంద్ర ప్రసార వినియోగము యొక్క కృత్యములై ఉండును.

అయితే, అట్టి సర్ ఛార్టీని ప్రస్తుత స్థాయి ఎదురు సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను.

అంతేకాక, అట్టి సర్ ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీలను కేంద్ర కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో క్రమంగా తగ్గించవలెను.

అంతేకాక, సర్ ఛార్జి చెల్లింపు మరియు దానిని వినియోగించవలసిన రీతిని కూడా కేంద్ర కమీషను నిర్దిష్ట పరచవలెను.

అంతేకాక, తన స్వంత వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశసౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్ ఛార్టీ విధించబడరాదు.

39.(1) రాజ్య ప్రభుత్వము. బోర్డును లేదా ప్రభుత్వ కం పెనీని రాజ్య ప్రసార వినియోగముగా అధిసూచించవచ్చును.

అయితే, రాజ్య ప్రసార వినియోగము విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నం కారాదు.