పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

విశదీకరణ:- పరిచ్ఛేదములు 35 మరియు 36 యొక్క ప్రయోజనముల నిమిత్తము "మధ్యలో నున్న ప్రసార సౌకర్యములు " అనగా ఇతర లైసెన్సువారు కొరకు మరియు అతడి తరఫున "అతడి అభ్యర్ధన పై మరియు టారిఫు లేక ఛార్జీ చెల్లింపుపై విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకు వినియోగించదగినట్టి విద్యుత్ లైన్లు లైసెన్సుదారు. స్వామిత్వము కలిగియున్న లేక , నిర్వహించబడుచున్న విద్యుత్ లైన్లు అని అర్ధము.

37. సముచిత ప్రభుత్వము, సాఫీగాను మరియు స్థిరమైన ప్రసారము నిర్వహించుట కొరకు మరియు ఏదేని ప్రాంతము లేక రాజ్యమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు అవసరమైనట్టి చర్యలను తీసుకొనుటకు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రములకు లేక సందర్భానుసారముగా రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రములకు ఆదేశములను జారీచేయ వచ్చును.

38.(1) కేంద్ర ప్రభుత్వము, ఏదేని ప్రభుత్వ కంపెనీని కేంద్ర ప్రసార వినియోగముగా అధిసూచించవచ్చును.

అయితే, కేంద్ర ప్రసార వినియోగము, విద్యుచ్ఛక్తి ఉత్పాదన లేక విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నం కారాదు.

అంతేకాక, సదరు కేంద్ర ప్రసార వినియోగమునకు సంబంధించిన ఏదేని ఆస్తి, ఆస్తిలో హితము, హక్కులు మరియు దాయిత్వములు మరియు విద్యుచ్ఛక్తి ప్రసారముతో ప్రమేయమున్న సిబ్బందిని, కంపెనీల చట్టము, 1956 క్రింద నిగమితమొనర్చబడునట్టి కంపెనీ లేక కం పెనీలకు భాగము 13 క్రింద నిర్దిష్ట పరచినట్టి రీతిలో అమలు చేయబడునట్టి బదిలీ పథకము ద్వారా ప్రసార లైసెన్సుదారుగా పనిచేయుటకు కేంద్ర ప్రభుత్వము బదిలీ చేయవచ్చును. మరియు వాటిలో నిహితము చేయవచ్చును. మరియు అట్టి కంపెనీ లేక కంపెనీలు ఈ చట్టము క్రింద ప్రసార లైసెన్సుదారులుగా భావించబడవలెను.

(2) (ఎ) అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ ద్వారా విద్యుచ్ఛక్తి ప్రసారము చేపట్టుట;

(బి) (i) రాజ్య ప్రసార వినియోగములు:
(ii) కేంద్ర ప్రభుత్వము;
(iii) రాజ్య ప్రభుత్వములు; -
(iv) ఉత్పాదన కంపెనీలు,
(V) ప్రాంతీయ విద్యుత్ కమిటీలు
(vi) ప్రాధికార సంస్థ.
(vii) లైసెన్సుదారులు:
(viii) ఈ విషయమై కేంద్ర ప్రభుత్వముచే అధీసూచించబడునట్టి ఏవరేని ఇతర వ్యక్తితో