పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

(ఐ) సర్వీసు లైన్లు
(జె) పనులు

లలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ అంశాలు చేరుతాయి.

(51) "ఆవరణలు” అను పదపరిధిలో ఏదేని భూమి, భవనము, లేక కట్టడము చేరియుండును;

(52) "విహితపరచిన" అనగా ఈ చట్టము క్రింద సముచిత ప్రభుత్వముచే చేయబడిన నియమముల ద్వారా విహితపరచిన అని అర్థము:

(53) "సార్వజనిక దీపం" అనగా ఏదేని వీధిలో వెలుతురు కొరకు వాడబడు విద్యుత్ దీపం అని అర్థము;

(54) “రియల్ టైమ్ ఆపరేషన్" అనగా " ఈయబడిన (నిర్దిష్ట) సమయానికి విద్యుచ్ఛక్తి వ్యవస్థ గురించిన సమాచారమును సంబంధిత లోడ్ డిస్పాచ్ కేంద్రమునకు లభ్యపరచుట కై తీసుకొనబడు చర్య అని అర్థము:

(55) “ప్రాంతీయ విద్యుత్ కమిటీ" అనగా కేంద్ర ప్రభుత్వ తీర్మానము ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతమునకు ఆ ప్రాంతములో విద్యుత్ వ్యవస్థల సమీకృత క్రియాకలాపాలకు వీలు కల్పించుట కొరకు స్థాపించబడిన కమిటీ అని అర్ధము:

(56) "ప్రాంతీయ లోడ్ డిస్ప్యా చ్ కేంద్రము" అనగా 27వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద స్థాపించబడిన కేంద్రము అని అర్థము:

(57) “వినియమములు " అనగా ఈ చట్టము క్రింద చేసిన వినియమములు అర్థము:

(58) “రద్దు చేసిన శాసనములు" అనగా 185వ పరిచ్చేదము ద్వారా రద్దు చేయబడిన భారత విద్యుచ్ఛక్తి చట్టము, 1910, విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 మరియు విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 అని అర్థము;

(59) “నియమములు" అనగా ఈ చట్టము క్రింద చేసిన నియమములు అని అర్థము;

(60) "అనుసూచి" అనగా ఈ చట్టమునకు ఉన్న అనుసూచి అని అర్ధము;