పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

10/G10 (61). "సర్వీసు లైను" అనగా

(ఎ) పంపిణీ మెయిన్ నుండి గాని లేక వెంటనే పంపిణీ లైసెన్సుదారుని ఆవరణల నుండిగాని, ఒకే వినియోగదారునికి; లేక

(బి) అవే ఆవరణలకు పంపిణీ మేయిన్ నుండి వినియోగదారుల సముదాయమునకు లేక పంపిణీ మేయిన్ యొక్క అదే పాయింటు నుండి సరఫరా చేసిన ఆనుకొని ఉన్న ఆవరణములకు,

ఏ విద్యుత్ సరఫరా లైను ద్వారా విద్యుచ్చక్తి సరఫరా చేయబడినదో లేక చేయుటకు ఉద్దేశించబడినదో ఆ విద్యుత్ సరఫరా లైను అని అర్ధము;

(62) "నిర్దిష్ట పరచిన" అనగా ఈ చట్టము క్రింద సముచిత కమీషను లేక సందర్భానుసారముగ ప్రాధికార సంస్థచే చేయబడిన వినియమముల ద్వారా నిర్దిష్ట పరచిన అని అర్థము.

(63) " స్టాండ్ ఎలోన్ వ్యవస్థ" అనగా నిర్దిష్ట పరచబడిన ప్రాంతములో గ్రిడ్ ను జోడించకుండ విద్యుచ్ఛక్తి ఉత్పాదన మరియు పంపిణీ చేయుటకు నెలకొల్పబడిన విద్యుచ్ఛక్తి వ్యవస్థ అని అర్థము;

(64) “రాజ్యకమీషను" అనగా 82వ పరిచ్చేదము యొక్క ఉప పరిచ్చేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్దీకరణ కమీషను మరియు ఈ పదబంధ పరిధిలో 83వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్చేదము(1) క్రింద ఏర్పాటు చేయబడిన సంయుక్త కమీషను చేరియుండును;

(65) “రాజ్య గ్రిడ్ కోడ్" అనగా 86వ పరిచ్చేదములోని ఉప-పరిచ్చేదము (1) యొక్క ఖండము (హెచ్) క్రింద నిర్దిష్ట పరచిన రాజ్య గ్రిడ్ కోడ్ అని అర్ధము;

(66) “రాజ్య లోడ్ డిప్ప్యా చ్ కేంద్రము" అనగా 31వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (1) క్రింద స్థాపించిన కేంద్రము అని అర్ధము;

(67) “రాజ్య ప్రసార సంస్థ " అనగా 39వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వముచే అట్లు నిర్దిష్ట పరచబడిన బోర్డు లేక ప్రభుత్వ కంపెనీ అని అర్థము:

(68) "వీధి " అను పదములో సర్వసామాన్య మార్గమైనను లేక కాకున్నను, ప్రజలు దారికి హక్కు కలిగియున్నట్టి ఏదేని దారి, రోడ్డు, సందు, కూడలి, ఆవరణము, ఇరుకు సందు, మార్గము. లేక ఖాళీ స్థలము మరియు ఏదేని పబ్లిక్ వంతెన లేక కట్టపై రోడ్డు మార్గము లేక - కాలిబాట కూడ చేరియుండును;