పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78 రాధికాసాంత్వనము

చ. పరవశుఁ డైనశౌరిఁ గని పంకజలోచన రాధికామణిం
దొరఁగు మటంచు వేఁడుకొనెఁ ద్రోయక మాధవుఁ డిచ్చె నమ్మికల్
పురుషుల కేటి సత్యములు పూనికె లేడవి నమ్మికేది నీ
మరు లిటు కొండ లై పెరుగుమాత్రమె కాని కురంగలోచనా. 4

వ. అనిన విని ఘనాఘననిస్వనంబువిన్న చిన్నిరాయంచచందంబున గబ్బిబెబ్బులిమ్రోఁతలాకర్ణించిన కన్నెసారంగంబుతెఱంగున బిడాలఘోషంబాలకించిన బాలశుకంబురకంబున సింహనాదం బాలకించి బెగడిన పెంటియేనుంగుతెఱంగున బెగ్గడిల్లి యాపాదమస్తకంబునుం జల్లు మని పులకలు మొలకలెత్త గుండె గభీలనన్ వకావకలై తల్లడిల్ల డిల్లవడి యారామకారునిచే ఖండితం బయినకదళికాకాండంబుచందంబున నందనందనునిపైఁ జెందినవలపు నిలుపోపం జాలక చాల కరంగి జాలిమాలి నేలవ్రాలి మూర్ఛిల్లిన న్గనుంగొని చెంగట మెలంగుమెఱుంగుబోణు లెలుంగుదిగులున నమ్మకచెల్ల యీహల్లకపాణి నింక నమ్మగఁ జెల్లదను నుల్లసంబున నుల్లసిల్లుచు నవ్వల్లవపల్లవాధర నెత్తి యొత్తుపయ్యెదచెఱంగుల స్వేదబిందుసందోహంబులం బో నొత్తి చల్లనిపటీరనీరపూరంబు చల్లి నల్లకల్వరేకులు తుదల నల్లిబిల్లిగాఁ గనుపట్టువట్టివేళ్ళవీవనలు విసరి కెందమ్మిదళంబులం గట్టినకపురంపుపొట్లమ్ములం గర్ణంబులం గీలించి శైత్యోపచారంబుల సేద దేర్చఁ బెద్దయుం బ్రొద్దునకు ముకుళితంబు లగుకనుదమ్ములు విచ్చి పదాహతిఁ బొరలునురగాంగనభంగి బుసగొట్టుచుఁ గటితటంబు లుబుక ముక్కుపుటము లదర రాకానిశాకరబింబంబుడంబును విడంబించునెమ్మొగంబు జేవురింపఁ బ్రచండమారుతతండంబునం దవిలి వడంకు కెందలిరాకువీఁక బింబాధరంబు కంపింప మరుఁ డురువడి నొర వెరికి విరహులయురంబులు దూసిపోవం గ్రుమ్మి తదీయరక్తంబు లంటఁదీసి ధళధళఝళిపించుతళుకుకత్తుల జిత్తులం బెట్టుచుఁ గ్రొత్తలత్తుక చొత్తిల్ల మత్తిల్లుబిత్తరపుఁజూపులు కడకన్నులం గ్రుమ్మరింప డగ్గరి హెగ్గడికత్తియలు బెగ్గడిల్లి యవల నివలఁ దొలంగి నిలువ సాకారం బగుశోకంబురీతి సాక్షాత్కరించినకోపంబుభాతి సశరీరం