పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

(ఇళాదేవీయ మనునామాంతరముగల)

రాధికాసాంత్వనము

ప్రథమాశ్వాసము

శ్రీలఁ జెలంగురాధికను – జెల్వరొ ని న్నిల రూపరేఖలన్
బోలుదు రేపడంతు లన మోహపుటాలిని నిప్పు డెన్నెదో
హాళిని నన్నుఁ గూర్చి యని యల్గిన యచ్చెలిఁ గౌఁగిలించు గో
పాలునిఁ జిన్నికృష్ణునిఁ గృపాళునిఁ గొల్తు నభీష్టసిద్ధికై. 1