పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

మన్నారుదాసవిలాసము


సీ.

శ్రీరామభద్రనిర్మిత మైన యా సేతు
        వెన్నివేలేండ్లు దా నెసఁగుచుండు
నల విభీషణుఁడు నత్యకలంకమతి లంక
        నెన్నివేలేండ్లు దా నేలు(చుండు)
(చిలువల)గమికాఁడు నిల నెన్నివేలేండ్లు
        సొంపుమీరఁగ భరియింపుచుండు
..................................
        ...........................
............................
............................
...........................
............................

121


ఫలశ్రుతి

సీ.

నావిభుఁ డైన మన్నారుదాసునిచేత
        ముదమున మంజరీముఖకృతులను
బొగడొంద నంకితంబుగఁ గాంచు శ్రీరాజ
        గోపాలశౌరికిఁ గోర్కెమీర
నేనంకితము సేయు నిటువంటి మన్నారు
        దాసవిలాసంబు ధరణిలోనఁ
బరమభాగవతునిచరితంబు గావున
        వినిన వ్రాసిన చదివిన జనులకు


తే.

నాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
ఘనకనకముఖ్యవస్తువాహనసమృద్ధి
నిరుపమానకవిత్వపాండిత్యమహిమ
కలుగు నాచంద్రరవితారకంబుగాఁగ![1]

122
  1. ఈ సీసపద్యము ప్రథమ ద్వితీయాశ్వాసముల కడపటను M. No. 246 సంఖ్యగల
    గ్రంథమునఁ గానంబడియెడివి. గ్రంథాంతమున నుండుటయే యుచిత మని భావించి యవ్విధంబుగనే చేర్పఁబడినది.