పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

105


వాసనలన్ గనుపట్టు కట్టుకోడియును; మేలింపుగలిగింపు తాలింపులుగ
వండిన పొడపిట్ట, పొడగువ్వ, తీతువు, బాతువులును, పరిమళంబులం
బూరించు సంబారంపుకోడియును, మృదుగుణంబుగల పొదుగుడు కోడి
యును, నేరుపులు మీర నూరుపులుగ వండిన యుల్లంకి నేలనెమలి (తావి
ఠేవ)వలచు, చాల బాళిం దేలించు జాళెనంజుడును, దండిరుచి నిండియుండు
గండెమీలును, పలువగల రుచులకు నెలవగు నులువకో(డియును), (చా)ల
మేలు గలుగు వాలుగలును, కారంబుమీరు సన్నకారిజంబుల యూరుపు
లును, పొడికారిజంబుల కూరలును, పొట్టికాకరకాయల తలమెట్టు పిట్టల
తలలయూరుపులును, పొడినల్లలును, దిరినల్లలును, చిక్కుడుగాయలుఁ
గూర్చి చొక్కంబుగా వండిన తియ్యదనంబుగల రొయ్యలును, అరఁటి
బొందెయందంబున నూర్పుగా వండ నోరూరించు బలుగుణములుగల
మలుగుమీలును, అరఁటిపూలలీలఁ బొలుచు నులుచలును, కూశ్మాండ
ఖండంబులరీతి మెచ్చుగా నచ్చులుగ గోసి వండిన వరాహమాంసఖండం
బులును, మారువాలపడిదంబును, బిల్లలుగ వండిన జెల్లలును, నొమ్ముగల
బొమ్మడాయల చారులును, నొప్పుగల యుప్పురసంబులును, రుచుల
నివ్వటిల్లు గువ్వలయానంబును, ప్రతిలేని యతిరసంబులును, గుత్తు లగు
సారసత్తులును, చొక్కంబు లగు [1]చక్కెరబుగడలును, నొప్పుమీరు నప్పం
బులును, రాణగల పేణగములును, బ్రణుతింపఁదగు మణుఁగుబూవులును,
నెక్కు డగు చక్కెర [2]మండెగలును, ఆసగొలుపు నూసువులును, రాణించు
పేణీలును, దండిగల మెఱుంగుమండెగలును, పసిమిపసగలుగు గసగసల
మండెగలును మెచ్చువచ్చు నచ్చుకజ్జాయంబులును, (పొగడఁద)గు పొగడ
పూవుల కజ్జాయంబులును [3]లేమిగలు పాలకజ్జాయంబులును, మెరుఁగులు
గల నురుగులును, చిత్రంబు లగు నేత్రంబులును, గరగరికలుగల గరవడలును,
సాంద్రంబు లగు చంద్రకుండంబులును, తెప్ప లగు పప్పురొట్టెలును, బొంగ
రంబులు [4]నంగరొల్లెలును, లడ్డుకంబులు, నిడ్డెనలును, మిన్నగల జున్ను
లును, మిక్కిలి యగు నుక్కెరలును, నెన్నఁదగు పన్నీరుపాయసంబు
మొదలగు పాయసంబులును, రసాయనంబులును, జీనిచక్కెరలును, కండ
చక్కెరలును, వీక్షాప్రియంబు లగు ద్రాక్షాఫలంబులును, నిర్జితసుధారసంబు
లగు ఖర్జూరఫలంబులును, పలువగల కలవంటకంబులును, జంటలుగ
దొడ్డుగా వడ్డింప, నకుంఠరుచులు మెఱయ, నాకంఠంబుగా భుజియించి,
సారంబు లగు క్షీరంబులు గ్రోలి, పొడము బడలికల నొరగి చిఱుచెమట
లడఁగ విసరుకొనుచు, లేచి కరంబులకు [5]వార్చిరి; యవ్వేళ నవ్విజయ

  1. చక్కెరబురుడలును
  2. మండిగలును
  3. లేమిగల
  4. నంగరవొల్లెలును
  5. వార్చి