పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

మన్నారుదాసవిలాసము


రాఘవవిభుండును, నతిరాజసంబునఁ బ్రతిలేని రతనంపుగద్దియమీఁదఁ గొలు
వుండు నవసరంబున.

58


వ.

రాజచంద్రనృ(పాలకుండు).

59


తే.

కుంకుమంబును గస్తూరి సంకుమదము
కుందనపుగిన్నియల నించికొంచు వచ్చి
నొనరు మన్నరుదాసున కొసఁగి వేడ్క
బంధు(వర్గంబు)లకు నిచ్చెఁ బ్రౌఢి మెఱయ.

60


వ.

మఱియును.

61


క.

తెల్లని యాకుల కవిరెలు
మొల్లపువాసనల పోఁకముళ్ళును జాళ్వా
పళ్లెరములందు నింపుచుఁ
గొల్లలుగా నిచ్చె బంధుకోటుల కెల్లన్.

62


నాగవల్లి

వ.

ఇవ్విధంబున వివాహోత్సవంబు నివ్వటిల నాలవ దినంబున.

63


సీ.

అందంబు మీరంగ నాచార్యవర్యుండు
        నాగవల్లి యొనర్చు నయముతోడఁ
[1]బంచవన్నెల నిగ్గు బాగుగాఁ గనుపట్టఁ
        బ్రోలు వ్రాయింపుచుఁ బ్రోదిగాఁగ
నలుదిక్కులను జిత్రకలశముల్ హవణింప
        [2]జోతుల దీపముల్ సొరిది వెలయఁ
బరఁగ నుప్పేనుఁగఁ బప్పేనుఁగల వ్రాసి
        యిరుగడలందును నింపునింపఁ


తే.

బూని వేమరు నాగపసానిచేత
దేవతల పూజ సేయించి ఠీవి మెఱయ
శేషహోమంబు గావించి చెలువుగాఁగ
దంపతులఁ బెండ్లిపీఁటపైఁ దనర నిల్పె.

64
  1. బంచె వెన్నెల
  2. బోతుల