పుట:మత్స్యపురాణము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఈగ్రంథమును బ్రహ్మశ్రీ మ. రా. రా. మానవల్లి రామకృష్ణకవిగారివలన బ్రహ్మశ్రీ మ. రా. రా. చిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారు గ్రహించి ప్రకటింపఁదలంచిరి. ఇంతలో బ్రాచీనకృతుల ముద్రింపించి జగదుపకృతి యొనరించు శ్రీ శ్రీ శ్రీ పీఠికాపురపు రాజుగారి సదుద్యమము తెలియవచ్చుటయు శ్రీవారి కాగ్రంథము నొసంగిరి. శ్రీ సూర్యారావుబహద్దరువారును దమపండితులలో నొకరగు బ్రహ్మశ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రులవారిచే నాగ్రంథమును బరిష్కరింపించి శుద్ధగ్రంథలేఖకులగు భాస్కర రామమూర్తిగారిచే వ్రాయించిరి. అంతమాచే నభ్యర్థింపఁబడి మాకవితకు దయాపూర్వకముగా నొసంగిరి. ధనసాహాయ్యముతోఁ బాటు, గ్రంథసాహాయ్యముఁ గూడఁ జేసి మాకవితను బోషించు శ్రీవారి కభ్యుదయపరంపరాభివృద్ధిగా దీవించుచున్నారము.

పత్త్రికాధిపతులు.