పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

జగద్గురు శ్రద్ధానందతో అలీ సోదరులు, కిచ్లూ

అవకాశంగా భావించిన గాంధీజీ 1920లో ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొనమని పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్నహిందూ-ముస్లింలు ఒక్కటై బ్రిటిష్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నంగా కలకాలం నిలచిపోయే ఈ ఉద్యమం అనేక అనుకూల పరిణామాలకు కారణమైంది. ఈ ఉద్యమం సందర్భంగానే అలీ సోదరులుగా ఖ్యాతిగాంచిన ముహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ సోదరులతో కలసి గాంధీజీ భారత దేశ పర్యటన గావించారు. జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయమైన జామియా మిల్లియా ఇస్లామీయా ఆవిర్భవించింది. ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగానే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి శ్రీకారంచుట్టారు.

జాతీయ భావాలను పటిష్టపర్చిన ఈ ఉద్యమం ఫలితంగా బ్రిటిష్‌ సైన్యంలో పనిచేస్తూన్న భారతీయ సైనికులు, అధికారులు తమ ఉద్యోగాలు, పదవులు త్యజించి బయటకొచ్చేశారు. ఈ సందర్భంగానే 'ముస్లింలు బ్రిటిష్‌ సేవలో గడపటం, ధర్మ విరుద్ధమంటూ' ఉలెమాలు ప్రకటించారు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనలను పాటించాల్సిందిగా మౌలానా ముహమ్మద్‌ అలీ తదితర ప్రముఖ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందించి హిందూ-ముస్లిం నేతలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై మౌలానా అజాద్‌ తదితర ప్రముఖులు సంతకాలు చేయగా 1921లో జాతీయ కాంగ్రెస్‌ ఈ ప్రకటనను ఆమోదించింది.

40