పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత svaaతంత్య్రోద్యమం-ముస్లింలు

అబ్దుల్‌ బారి, మౌలానా హసరత్‌ మోహని, యాకూబ్‌ ఖాన్‌ తదితరులున్నారు.

రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపు నిచ్చారు. ఢిల్లీలో తొలి సత్యాగ్రహ సభ ఏర్పడింది. ఈ సభకు డాక్టర్‌ యం.ఎ. అన్సారి, డాక్టర్‌ అబ్దుల్‌ రహమాన్‌ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరించారు. ఈ నేతల నాయకత్వంలో ఆక్కడ హర్తాల్‌ జరిగింది. మార్చి 30న ఢిల్లీలో జరిగింది. స్వామి శ్రధ్దానంద, హకీం అజ్మల్‌ ఖాన్‌ల మాట అక్కడ ఆజ్ఞ... అటువంటి హర్తాల్‌ ఢిల్లీలో ఎప్పుడూ జరగలేదు, అని మహాత్మా గాంధీ తన ఆత్మకథలో రాసుకున్నారు. (The Story of My Experiment with Truth, MK Gandhi, Page 423-424)

ఈ మేరకు సత్యాగ్రహ ఉద్యమం శాంతి యుతంగా జరుగుతున్నాసహించలేక పోయిన ప్రబురత్వం ఉద్యమకారుల మీద కాల్పులు జరిపింది. పంజాబులో సత్యాగ్రహనేతలు

జలియన్‌వాలాబాగ్ హిరోగా ఖ్యాతిగాంచిన డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, ఆయన సహచరులు

డాక్టర్‌ సత్య పాల్‌లను ద్వీపాంతరవాస శిక్షకు గురిచేసినందున ఆగ్రహించిన ప్రజలు జలియన్‌వాలాబాగ్ లో సమావేశమయ్యారు.

ఈ సమావేశాన్ని విచ్ఛిన్నంచేయ సంకల్పించిన జనరల్‌ డయ్యర్‌ విచక్షణా రహితంగా సభికులపై కాల్పులు జరిపి వందలాది దేశభక్తులను పొట్టనపెట్టుకున్నాడు. అమరవీరుల్లో ముస్లింల చాలా మంది ఉన్నారు. ప్రభుత్వలెక్కల ప్రకారం 378 మంది ఈ దుస్సంఘటనలో ప్రాణాలు పొగొట్టుకోగా, ఆ అమర యోధులలో 55 మంది ముస్లింలు ఉన్నారు.

అమృతనర్‌ జిల్లా దుల్లా గ్రామానికి చెందిన 50 ఏండ్ల వయస్కురాలైన ఉమర్‌ బీబి అను మహిళ కూడా జనరల్‌ డయ్యర్‌ సైనికుల తుపాకి గుళ్ళకు ప్రాణాలు అర్పించి ఆనాటి అమరయోధుల జాబితాలో స్థానం పొందటం విశేషం.

హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నం 'ఖిలాఫత్‌'

బ్రిటిష్‌ ప్రబు త్వం 'ఖలీఫా' పదవిని రద్దుచేసేందుకు ప్రయ త్నించటంతో, అందుకు నిరసనగా ఆరంభమైన ప్రపంచవ్యాపిత ఉద్యమంలో భాగంగా భారతీయ ముస్లింలు ఖిలాఫత్‌ ఉద్యమానికి సన్నద్దులయ్యారు. బ్రిటిష్‌ సామ్రాజ్య కాంక్షకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు, హిందూ-ముస్లింల ఐక్యతను పటిష్టపర్చేందుకు ఇది చక్కని

39