పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ తరువాత ప్లాంటర్ల ఆదేశాలను తుంగలో తొక్కి, విందు సమయంలో సూపులో విషం కలిపిన విషయాన్ని నేరుగా గాంధిజీకి తెలిపారు. ఆ సమయంలో డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా మహాత్ముని వెంట ఉన్నారు. ఆనాడు అన్సారి చూపిన ధైర్యం, తెగింపు ఆయనను ఆశ్చర్యచకితుల్ని చేశాయి.

ఆ తరువాత 1947లో స్వాతంత్య్రం లభించింది. డాటర్‌ రాజేంద్ర ప్రసాద్‌ రాష్ట్రపతి అయ్యారు. ఆయన రాష్ట్రపతి హోదాలో 1950 సంవత్సరంలో మోతిహరి గ్రామం సందర్శించారు. ఆ సందర్భంగా ప్లాంటర్ల కుట్రకు చేయూతనివ్వక పోవటంతో ఉద్యోగం పోగొట్టుకుని, ప్లాంటర్ల చిత్రహింసలకు గురై అన్ని విధాల నష్టపోయి పేదరికం పొత్తిళ్ళలో కాలం గడుపుతున్న బతఖ్‌ మియా అన్సారిని ఆయన చూసారు. 1917 నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని, అన్సారికి 50 ఎకరాల భూమిని ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశం అధికారుల సహజ అలసత్వం వలన 1957 ప్రాంతంలో, బతఖ్‌ మియా అన్సారి మరణించాక గాని అమలు జరగపోవటం విషాదం.

(స్వాతంత్య్రసమరయోధులు సయ్యద్‌ ఇబ్రహీం ఫిక్రి చే విరచితమై భారత ప్రభుత్వం సహాయంతో 1999లో ప్రచురితమైన, 'హిందూస్తానీ ముసల్మానోంకా జంగ్- యే-ఆజాది మే హిస్సా ' గ్రంథం పేజి 22-24)

జలియన్‌ వాలాబాగ్ హిరో డాక్టర్‌ కిచ్లూ

బ్రిటిష్‌ ప్రభుత్వం1918లో రౌల్‌చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ప్రధానంగా ముస్లింలపై దమనకాండకు గురిపెట్టింది. ప్రభుత్వ దమన నీతిని గమనించిన మహాత్మాగాంధీ బ్రిటిష్‌ శాసనాలను ఉల్లంఫిుంచమని ప్రజలకు పిలుపు నిచ్చారు.


ఈ సందర్భంగా హిందూ-ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రతిజ్ఞలు చేశారు. ప్రతిజ్ఞాపత్రాల మీద

తొలిగా సంతకాలు చేసిన వారిలో హకీం అజ్మల్‌ ఖాన్‌, జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యబ్జీ, ఉమర్‌ సుభాని, డాక్టర్ యం.ఎ. అన్సారి, చౌదరి ఖలీఖుల్‌ జమా, మౌలానా

డా|| సైఫుద్దీన్‌ కిచ్లూ

38