పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

కె. రామచంద్రామూర్తి

సంపాదకులు

ఆంధ్రజ్యోతి, దినపత్రిక

మతసామరస్యం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తాత్విక ప్రాతిపదిక. భారతీయతను హిందూత్వంగా అపార్ధం చేసుకొని సంకుచిత దాృష్టితో నితర్వచనం చెప్పేవారున్నారు. ఈ నిర్వచనాన్ని ప్రశ్నించకుండ శిరసావహించి అల్పసంఖ్యాక వర్గాలు, అధిక సంఖ్యాకుల అభీష్టానికి అనుకూలంగా మసలుకోవాలని కోరేవారు హిందువులలో కొందరు ఉన్నారు. తాము నిజంగానే భారత జీవన ప్రధాన స్రవంతిలో భాగం కామనీ, కాబోమనే ఆత్మన్యూనతాభావనతో దూరం దూరంగా జరిగే అల్ప సంఖ్యాక వర్గాల వారూ ఉమన్నారు. ఈ ధోరణులన్నీ భారతీయతకు వ్యతిరేకమైనవి. భారత సమాజంలో హిందాువుల, ముస్లింలూ, క్రైస్తవులూ, సిక్కులూ, పార్శీలూ, తదితర సకల మతాలవారు సమాన హక్కులతో, సమాన స్వేచ్ఛతో జీవించాలి. అదే మన తాత్విక పునాది. అదే మన రాజ్యాంగ నిర్మాతల సంకల్పం. ముసింలు ఇక్కడివారు కారనీ, ఎక్కడి నుంచో వచ్చినారనీ, ఎక్కడికో వెళ్ళవలసినవారనీ, ఒకవేళ ఇక్కడ ఉండదలచుకుంటే మాత్రం హిందువుల ఇష్టాయిష్టాలను గౌరవించాలని భావించే హిందువులు కానీ, తమకు ఈ సమాజంలో స్థానంలేదని, తమను ప్రధాన స్రవంతిలో కలవనివ్వరనీ, ద్వీతీయ శ్రేణిపౌరులుగానే శాశ్వ్తతంగా మిగిలిపోవాలనీ తలపోసే మైనారిటీ వర్గాలవారు కానీ, చరిత్రను సవ్యంగా అర్దం చేసుకోవడంలో విఫలమైనవారని గుర్తించాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా తరతరాలుగా ఈ నేలను నమ్ముకొని ఇకక్కడ ట్టి ఇక్కడమట్టిలో క లి సి పోయేవారంతా భారతీయులేనన్న ప్రాథమిక అవగాహన సహజీవన సిద్ధాంతానికి స్పూర్తి. విభిన్న జాతుల, భాషల, సంస్కృతుల సమాహారమే భారత జాతి. ' భిన్నత్వంలోఏకత్వం ' మన ప్రత్యేకత. మనది బహుముఖీనమైన సమాజం. పూలతోటలో ఎన్ని రకాల, ఎన్ని రంగుల పూలు ఉంటాయో నవభారత బృందావనంలోనూ అన్ని రకాల, అన్ని రంగుల, అన్ని ధోరణుల మనుషులు ఉంటారు. మొగలు సామ్రాజ్య నిర్మాణం తర్వాత ముస్లింలు భారతదేశంలో స్థిరపడిపోయారు. ఇక్కడి జీవన స్రవంతిలో కలిసిపోయారు. గత ఏడు