పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శతాబ్దాలుగా హిందువులతో కలిసి సుఖదుఖాలు పంచుకుంటున్నారు. ఉభయ మతాలవారిదీ ఇన్నేళ్ళాఒకే చరిత్రా, ఒకే భాషా, ఒకే సంస్కృతీ. హిందూ నాయకులలాగానే ముస్లిం నాయకులు కూడ ప్రజలలో ఆధునిక దాక్పథాన్ని ప్రోత్సహించడానికీ, జాతీయ భావాన్నీపాదుకొల్పడానికీ, లౌకిక తత్వాన్నిజీవన విధానంగా మలచడానికీ అహర్నిశం కృషిచేశారు.హిందువులు అధిక సంఖ్యాకులైనప్పటికీ వారికీ, ముస్లింలకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ మధ్య సౌభ్రాత్వం వెల్లివిరిసింది. శాంతియుత సహజీవనం ద్వారా సమిష్టి ప్రయోజనాలు సాధించుకోవడం ఎలాగో అన్ని మతాలవారూ నేర్చుకున్నారు. బ్రిీష్‌ పాలనను ఐక్యంగా ప్రతిఘటించారు. 1857 నాటి ప్రథమ వస్వాతంత్య్ర సమరంలో హిందాువులు, ముస్లింలు కలసి వీరోచితంగా పోరాడరు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలుపరచిన బ్రిీష్‌ పాలకులు బుద్థిపూర్వకంగా హిందువులూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి, వాటిని పెంచి పోషించి, దేశ విభజనకు దారితీశారు. ఈ దుర్మార్గమైన క్రీడలో బ్రిీష్‌ పాలకులకు తోడుగా బ్రిీ టిష్‌ చరిత్రకారులు,అధికారులు నిలిచారు. మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ, ప్రథమ స్వాతంత్య్రసమరం విఫలమయ్యేవరకూ, బ్రిీష్‌ వారి విచ్ఛిన్న రాజకీయాలు సాగలేదు. బ్రిీష్‌వారి కుట్ర ఫలితంగా కొందరు ముస్లింలు తాము భిన్నమైనవారమనే ధోరణిలో ఆలోచించడం ప్రారంభించారు. భారత జీవన ప్రధాన స్రవంతి నుంచి క్రమంగా దూరం కాసాగారు. మత భావనలకు ప్రాధాన్యం పెరిగింది. హిందువులలో మూఢాచారాలు తొలగించడానికీ, ఆధునిక దృష్టిని ప్రోత్సహించడానికీ రామమోహనరాయ్‌, స్వామీ వివేకానంద,దయానంద సరస్వతి వంటి సంస్కర్తలు కృషి చేసినట్టే ముస్లింలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడనికీ సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ వంటివారు ఉద్యామాలు నడిపారు. బద్ద్రుద్దీన్‌ త్యాబ్జీవటి సంస్కర్తలు ఈ ఉద్యామాన్ని జయప్రదం చేసేందుకు శ్రమించారు. మహమ్మదాలీ జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని కోరినప్పటికీ అనేకమంది ముస్లిం నాయకులు గాంధీనే తమ నాయకుడిగా పరిగణించి స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేశారు. విభజనను వ్యతిరేకించారు. అయినప్పటికీ దేశ విభజన జరిగింది. విభజన తర్వాత తమ వాయవ్యసరిహద్దాు ప్రాంతం పాకిస్థాన్‌లో భాగంగా ఉండడం ఇష్టంలేని సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌, గాంధీతో మ్లాడుతూ ' మమ్మల్నితోడేళ్ళ పాలు చేశారు ' అంటూ బాధనువ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌ ఏర్పడిన తర్వాత కూడ కోట్లాది ముస్లింలు భారతదేశంలో ఉండిపోయారు. పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు.ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న దేశం భారత్‌.దేశవ్యాప్తంగా వారు గ్రామాలలో, పట్టణాలలో సమాజంలో భాగమై పాలలో నీళ్ళలాగాకలిసిపోయి జీవిస్తున్నారు. స్వార్థ్ధపరులైన కొందరు రాజకీయవాదులూ, వ్యాపారులూ హిందువులలో, ముస్లింలలో మతావేశాన్ని రగిలించి తమ స్వార్థ, సంకుచిత ప్రయోజనాలు నెరవేర్చుకునే క్రమంలో మతకలహాలూ, మారణహోమాలు జరిగాయి, జరుగుతున్నాయి.