పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

223

నప్పురి నిండంగ నంధకారంబు - గప్పి నెల్లెడ వంటకంబులు వ్రుచ్చె
బావులుఁజెఱువులుఁ బద్మాకరములు - వావిరి నూతులు వరువట్లు వట్టె
వనములు ఫలపుష్పవాటిక ల్గమరెఁ - గనుఁగొనఁ బశుపక్షిగణ మర్వఁదొణఁగె
ధరణిఁద్రొక్కినఠావు దరికొని కాల - దొరకొనియెను గాలి ధూళియు నెగసెఁ
తవిలి యిబ్బంగి నుత్పాతము ల్వుట్ట - భువిసర్వజనులు నబ్భూసురావలియు
భోగయ్య వోవఁగఁబురములింగములు - భోగయ్య వెనుకొనిపోయెఁబోవుటయు
నింతింతగార్యంబు లిలఁబుట్టె ననుచు - సంతాపచిత్తులై చయ్యన నేఁగి
శరణుసొచ్చితి మంచు జయజయయంచు - నరికట్టుకొనుచు సాష్టాంగంబు లిడుచుఁ
గావవే మముఁబాపకర్ముల భోగి - దేవయ్య దెస దిక్కు నీవ మా కనుచు
నవుదల ల్వంచుచు నయ్య మీధర్మ – కవిలెల మంచును గడుదైన్యపడుచు
సభయాత్ములై యున్న చండివిప్రులను - నభయంబులొసఁగి భోగయ్య తత్క్షణమ
మరలి కెంబావికి నరుదెంచె లింగ - పరికరుఁడగుచు నన్నరులు గీర్తింప
నాలింగములు భక్తి కటశాసనముగ - నోలి నన్యోన్యశివాలయంబులను
బెద్దపీఠంబులఁబిన్నలింగములు - బెద్దలింగంబులుఁబిన్న పీఠములఁ
భీమలింగంబులు రామపీఠముల - రామలింగంబులు భీమ పీఠములఁ
స్ఫటికలింగంబులు బాణపీఠముల - స్ఫటికపీఠంబుల బాణలింగములు
గనుఁగొన నిబ్భంగిఁగ్రక్కున నిలిచె - జనులకు నిదియె దృష్టప్రత్యయముగఁ
బొనరుచుఁగెంబావి భోగిదేవయ్య - వెనువెంటఁజనివచ్చి వీటఁ బీఠముల
నిలిచిన లింగమూర్తులు సాక్షిగాదె - మలహరుభక్తులు కులజులౌటకును

గుడ్డవ్వగారి కథ


నరనాథ గుడ్డవ్వ నాఁగ వెండియును - బరు లెల్లఁ దను బెద్దభక్తురా లనఁగఁ
బట్టినంతన తెగిపడియెడి కుష్ఠు - వట్టి రూపఱియున్న నట్టిచో నొక్క
నాఁడు నావిందిగె నాఁబురవీథిఁ - బోఁడిగా గుడ్డవ్వ వోవ భూసురులు
“నలుకలే కీ యగ్రహారంబులోని - కులిపి [1]జంగెత రాక నిలునిలు మనుడుఁ
బాపిష్ఠులగునట్టి పాఱులఁజూచి - శాపించుచును నింక సౌరాష్ట్ర మేఁగి
కాయంబువడయ కీ గ్రామంబు సొత్తు - నే యంచు నాత్మఁబ్రాణేశ్వరు నిలిపి
[2]ముదిత సౌరాష్ట్రాభిముఖియౌచుఁబోవఁ - బదయుగము విరిసి కదలరాకున్న

  1. జంగత
  2. మురిసి