పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

బసవపురాణము

[1]మోఁకఱించుచువంగి మొగినేఁగ నేఁగ - మోఁకాళ్లుఁజేతులు మురియ నిల్వకయు
గ్రక్కునఁద్రోవఁబొరలిపొర్లి [2]పోవ - వ్రక్కలై మే నెల్ల విక్కనవిరియ
నంతలో నధికదయార్ద్రభావమునఁ - గంతుసంహరుఁడు స్వాకారంబుఁదాల్చి
యచ్చుగా సౌరాష్ట్రమందుండి యెదురు - వచ్చి సోమేశుండు వనిత దేహంబు
దివ్యాంగముగఁజేయఁదెఱవ మ్రొక్కుడును - భవ్యుండు వెండియుఁబటుదయామతిని
అడు గడ్గు నీ కీప్సితార్ధ మిచ్చెదను - బడఁతి మెచ్చితి నీదుభక్తికి ననిన
మన్మనోరమ్య నిర్మలభావగమ్య - సన్మతి మీ పదాబ్జప్రేక్షణమున
జన్మమునేఁడు దా సఫలతనొందె - నున్మదవ్యాధి గుణోద్వృత్తి యణఁగె
నసమాక్ష యింక నొండభిమతార్థముల - దొసఁగేలఁబెన్నిధి దొరకొనియుండఁ
జరగడుగఁగఁబోవు వెరవిండ్లుగలరె - వరద నీ విట్లు సుస్థిలలీలఁదనరి
యిక్కడ నుండు నాకింతియ చాలుఁ - దక్కినవరములచిక్కు లేనొల్ల
ననుడు నావిందిగె యను పురంబునను - దనరు సోమేశుఁడత్యద్భుతలింగ
మూర్తిఁజేకొనియుండె ముదితగుడ్డవ్వ - కీర్తి లోకముల నంకింపంగఁబడియె
నటమీఁదనాయమ్మపటుభక్తి మహిమ - మట యీశ్వరునకైన నరిదిదానెన్న
వనిత మున్నపహసించిన ద్విజాధముల - తనువులు సెడియె గుష్ఠనిరూఢివలన
గుడ్డవ్వయని ధరఁగొనియాడుచుండ - గుడ్డవ్వభక్తికి గుడ్డయై పఱగె
నటుగాన కులహీనులన నెట్లువచ్చు - నిటలాక్షుభక్తుల నిఖిలేశ్వరుండ
కని ప్రతిష్ఠాపూర్వకం బైన పిదపఁ - జెనసి లింగమకాక శిల యనఁజనునె
యతిశయలింగదీక్షితుఁడైనయట్టి - వ్రతి నంత్యజుండనిమతిఁజూడనగునె
హరసన్నిహితుఁబూర్వమరయుటయెల్ల - హరుశిలయన్న యట్లధికపాతకము
మేదినీవల్లభ మేరువు సోఁకి - కాదె తచ్ఛాయన కాకి వట్రిల్లు
భృంగసంస్పర్శఁబతంగంబుదొంటి - యంగంబునకుఁబాయుటది దెల్లగాదె
వారిధిఁదటినీ ప్రవాహముల్ గలయఁ - బేరున్నదే వేఱె పెక్కు లేమిటికి
సిద్ధరసస్పర్శఁ జేసి యౌఁగాదె - శుద్ధసువర్ణంబు శుద్ధతామ్రంబు
గురుకరస్పర్శచేఁగులమొక్కఁడౌట - యరిదియేయట్ల యంత్యజుఁడు నగ్రజుండు
ధర"నుమామాతాపితారుద్ర”యనఁగ - సరినొక్కదల్లి ప్రజలకు వేఱెద్ది
యొప్పెడుమాణిక్య మొక మసికోక - నెప్పాటఁబొదివిన నిలఁగాంతి సెడునె

  1. మోఁకరించుకొ
  2. పొరల్‌వోవ