పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

బసవపురాణము

మఱియేలవేయును నెఱయఁబండించి - యఱప డిగ్గినయట్టు లయ్యెనుర్వీశ
మును వెల్లవేగియుఁదినికి చా బిడ్డఁ - గనిన చందంబయ్యె జనపాలతిలక!
తివిరినిండఁగముంచి [1]యవియఁగఁద్రోచు - నవివేకి నైతిఁబేరాసగాఁజేసి
యింతగాలంబుంట యిది వృథయయ్యెఁ - జింతింపకెట్లు ధరింతు భూనాథ
యింక నైనను గట్టెలిందువైపించు - బొంకు [2]గాదేఁ గెదఁ, బొగదాఁకఁదడవ
వినుము నేఁగైలాసమునకు నేఁగుటకు - జనులకు నెల్ల దృష్టముగ నీయున్న
వటము వేళులతోన వడిఁబెఱికికొని - యిటయందఱునుజూడనటయేఁగుదాన
ననవుడుఁబౌరులత్యద్భుతంబంద - జననాథుఁ డౌఁగాక యనుచు హర్షించి
గ్రక్కున మలయజకాష్ఠము ల్వేర్చి - యక్కజంబంద దివ్యాంబరావలులు
పేని ముప్పిరిగొల్పి పేరిన నేతి - లో నించి యాయగ్నిలో దరికొల్ప
భుగులు భుగుల్లనఁబొగ మఱ్ఱిమీఁది - కెగయులోనన దిగదిగఁ బఱతెంచి
భోజుఁడుఁదనమిత్రపుత్ర బాంధవులు - నాజనావళియును సమ్మఱ్ఱివ్రాఁక
భూతంబుపైఁబొగ వొలయంగఁదడవ - ఖ్యాతిగా మఱ్ఱివృక్షముఁగూడఁబెఱికి
కొనుచు నక్కైలాసమున కేఁగె భోజ - జననాథజనయూధ సహితంబుగాఁగఁ
దెల్లమీ యుద్భటదేవుని మహిమ - ముల్లోకముల ధరావల్లభ వినవె

కక్కయ్య కథ


నిక్కంబు వెండియు నిఖిలేశ్వరుండ - ముక్కంటిగణము దాఁగక్కయ్యనాఁగ
నీ ద్విజులకు వైరి యెఱుఁగవే యొక్క - విద్వాంసుఁడీనగరద్వారమందుఁ
బాటియైన పురాణభట్టును బోలెఁ - గాటెర్కులెల్ల నక్కజమందివినఁగఁ
బరగఁగ బ్రహ్మకపాలంబు వట్టి - హరుఁడు భిక్షించె మున్ననియెడిఁగాని
వఱలుశూలమున విష్వక్సేనుఁబొడిచి - మఱివిష్ణునడిచిన తెఱఁగు సెప్పండు
వెరవున బలిఁగట్టి వెండియుఁబెఱిగి - హరిమీఁదికెత్తెఁగా లనియెడిఁగాని
యట్టి త్రివిక్రము నెట్టెమ్ము విఱిచి - పట్టె నీశ్వరుఁడని ప్రతిభసెప్పండు
వ్యాసుండు చేయెత్తె ననియెడిఁగాని - వ్యాసుని చేయి నిహతమైన దనఁడు
హరుఁడు యజ్ఞములోన నలిగి కేశవుని - శిరము ద్రుంచినచోటు సెప్పెండు సదివి
నరసింహరూపమై హరి హిరణ్యాక్షు - హరియించె మున్ను దా ననియెడిఁగాని
శరభ రూపముదాల్చి నరసింహుఁ ద్రుంచి - హరుఁడు దిత్తొల్చిన [3]యది సదువండు

  1. యవయగ
  2. నాకే
  3. యచటుసద్వండు