పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

219

శ్వపచుఁడైననులింగసహితుఁడైయున్న - నుపమింపసద్బ్రాహ్మణోత్తమోత్తముఁడు
త్రిపురారిఁగొల్వని ద్విజముఖ్యుఁడైన - శ్వపచాధములకంటెఁజాలంగఁగీడు

ఉద్భటుని కథ


[1]అదిగాక బల్లకియను పురంబునను - నుదుబటుఁడన నొప్పు నొక్క భక్తుండు
వరభోజరాజను నరనాయకునకు - గురువయి శివదీక్షఁగరుణించి మఱియు
వేదశాస్త్రార్థ సంపాదితయుక్తి - నా దేశమున నన్యవాదంబు లణఁచి
క్షోణీశునకుఁబాడు జొమ్మవ్వనాఁగఁ - [2]బ్రాణేశసద్భక్తి పరురాలుగాన
నతివయుఁదాను సమంచితభక్తి - గతినిరంతర సుఖస్థితిఁదేలుచుండ
మనుజు లత్యద్భుత మానసులగుచుఁ - బనువుచు నిట్టి సద్బ్రాహ్మణోత్తముఁడు
కులహీనులను దాను గూడియున్నాఁడు - తలఁపంగఁబెద్దలు దార యిబ్బువిని
ననుచు నబ్భోజరాజున కెఱిఁగింప - వినియుఁదొల్లిటియట్ల కొనియాడుచుండఁ
బరమేశ్వరుండు నుద్భట్టయ్యగారి - వరభక్తి మహిమ యివ్వసుమతిలోన
నరుదుగా మెఱయింతునని యమ్మహాత్ముఁ - గరమర్థితోఁదన్న కాఁగూర్చుకొనుడు
దహనక్రియలుసేయఁదత్సమీపమున - మహి నెదురేచూచు మఱ్ఱిభూతములు
[3]గిదియొక్కటి సాల కేణ్నూరు నచటి - పొగదాఁకి కైలాసమున కప్డు వోవ
నందొక్క భూత మాహారార్థమేఁగి - వందుచు మఱుపూఁట వచ్చి భూతములఁ
గానక యేడ్చుచుఁగటకటాయనుచు - మానక వాచర్వమహి యెల్ల నద్రువ
గూయిడ నిది యేమొకో యంచు జనని - కాయంబు భోజుండు గ్రక్కున వచ్చి
యెవ్వ రేడ్చినవార లేమికారణము - నెవ్విధంబునఁగాని యేడ్పుడుగ వన
“వినవయ్య పండ్రెండు వేలేండ్లనుండి - మనుజేశ యుద్భటు మరణంబుఁగోరి
యేడునూ [4]ఱీమఱ్ఱి నెలమి భూతములు - నేడకు నేఁగక యెదురు సూచుచును
నుండె నే నేఁగితి నుదరాగ్నిఁజేసి - యుండంగఁజాల కొక్కండ చిక్కితిని
పెనుపొందఁగాఁగూటిపేద దోడ్దప్పె - నని యాడుమాట నాయంద సంధిల్లె
నెలమి నొక్కటిసాలకేడ్నూఱుభూత - ములునుద్భటునిఁగాల్చు పొగ దాఁకఁదడ
కైలాసమున కేఁగ గతిచెడి తాన - భూలోకమునఁజిక్కి పొగిలెదఁదండ్రి
గ్రచ్చఱ నీనంగఁగాచి నక్కలకు - నిచ్చినయ ట్లయ్యె నీడితకీర్తి.

  1. అద్భుతంబుగబల్లకనుపట్టణమున నుద్భటుం
  2. బాణిస
  3. గసి, గిరి
  4. నూర్భూతములీ మఱ్ఱినెలమి