పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

217

బశువుల మనుచు నబ్రహ్మణ్యమనుచు - దిశలకు నోళులు దెఱచి యేడ్చుచును
వెక్కుచు నంతంతఁజిక్కుచుఁగూడ - స్రుక్కుచు ధరఁజాఁగి మ్రొక్కుచుఁజేరి
దీనుల నపగతజ్ఞానుల దురభి - మానులఁబుణ్యవిహీనుల ఖలుల
భ్రష్టుల నవగుణాశ్లిష్టుల నధిక - దుష్టుల నిలఁగడుఁగష్టుల జడులఁ
గ్రోధుల నధికాపరాధుల నతివి - రోధుల జ్వలననిరోధుల మమ్ముఁ
గావరే దీవనఁబ్రోవరే తప్పు - [1]ద్రావరే చలిగాలఁద్రోవరే యింక
నూరు మున్ జనమేజయుఁడు [2]సేసె నగ్ర - హార మింతటనుండి మీ రుద్ధరించి
పొరిని బునర్ధారఁబోయరే [3]మాకుఁ - గరుణించి మీ [4]బ్రహ్మపురుల మే మనుచు
నా విప్రజనులు సాష్టాంగులై మ్రొక్కి - లేవకయున్న నాలించి లెండనుచు
నా ప్రసాదమునకు నంజలియొగ్గి - సుప్రసన్నాత్ముడై చూడఁగఁదడవ
గహనప్రసాదాగ్ని గ్రక్కున నాఱి - సహజ సంసిద్ధ ప్రసాదభావమునఁ
బ్రస్తుతింపఁగ బిబ్బ బాచయ్యగారి - హస్తంబులందుఁబ్రశస్తమై నిలిచె
నిప్పాటఁబాఁపల యిండు లన్నియును - నెప్పటిక్రియ నొప్పె నెఱుఁగ రే జనులు
యెన్నఁగ ధరణీశ యేండ్లుఁబూండ్లేల- మొన్నటివార్త యింకిన్నియు నేల
యసమాక్షుఁగొలువని యగ్రజుండైన - వసుధమాలలమాల వాఁడ కాకెట్లు
మాలఁడు శివుఁగొల్చి మాలఁడువెంపు - మాలఁడు రెంటికి మాలఁడీయుక్తి
మాలఁడే యీతని మాలఁ డన్ త్రాటి - మాలల భువిఁబచ్చి [5]మాలలు గాక
సెంబలియనియెనే చెన్నయ్యయింట - నంబకళముగ్రోలునప్పుడు శివుఁడు
మాదరచెన్నయ్య [6]మహిమయెఱింగి - మా దేవభక్తులు మాలలు నాఁగఁ
గూడునే బాఁపనకూళ[7]రువులకుఁ - గాడుగాఁడని నీచగతి విరోధింప.

మాదర దూడయ్యగారి కథ


నవనీశ వినవెట్లు శివునిభక్తుండు - ధ్రువకీర్తి మాదరదూడయ్య నాఁగ
మఱియొప్పు నా యయ్య మహిమ యెట్లనిన - నెఱయఁగ మెయిచెడ్డకఱకుఁబాఱుండు
[8]పసివెన్క నడురేయి వెసఁబోయిపోయి - మసలకదూడయ్య మందిరంబఱుత
సారమజ్జన జలపూరితపంక - మూరులు దరియంగ నొగిఁజొచ్చి వెడలి
కూడఁగాళ్లు గడిగికొని ప్రభాతమునఁ - జూడఁబూర్వచ్ఛాయ శోభిల్లియున్న

  1. గ్రోవరే
  2. విడ్చి, విడిచి
  3. తమకు
  4. ధర్మ
  5. మా(లులు)లరు
  6. మెర్గియెర్గి
  7. ఱపు, పుర్వు
  8. పసియేఁగవెనుకను