పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

బసవపురాణము

బరగుచు నాఁబోతు భక్తుఁడు దపసి - మరణంబు నొందిన మగిడించు బాస
నడచుచో నంబుధి నది యడ్డ[1]మైన - నడఁగించి త్రోవన యరిగెడు బాస
భక్తిసత్క్రియలు దప్పక చేయుబాస - వ్యక్తిగా భక్తినియుక్తిఁబెంపారి
భువి నొప్పి ముసిఁడి యన్పురవరంబునను - సవిశేషభక్తిమైఁజౌడయ్య యుండ
బసవనిభక్తిసౌభాగ్య మహత్త్య - మసలార విని [2]దర్శనాసక్తిఁజేసి
భక్తులుఁదానును బరమానురాగ - యుక్తులై చనుదెంచుచుండ నొక్కెడను
జాలదోయిటనెత్తి చల్లిన నిసుము - రాలినియట్టి యరణ్యాంతరమున
ముసిఁడివృక్షంబు లొప్పెసఁగ నెల్లెడల - పసిఁడి [3]కొండలభాతిఁబండి వెలుంగ
“నసలార ముసిఁడిపండ్లారగింపంగ - నెసఁగ లింగములకు నిష్టమైనయది”
యనుచు భక్తానీక మానతిచ్చుడును - విని సంస్మితానన విలసితుం డగుచుఁ
జనిచని ముసిఁడివృక్షంబుల మొదలఁ - దనకరవా లూని దట్టుఁడై నిలిచి
“యారగింపవె దేవ!” యని విన్నవింప - వారివారిక గణవ్రాత మేతెంచి
నమృతాంశుధరునకు [4]నర్పించి వేడ్క - నమృతాంశుధరుభక్తు లారగించుచును
“ముసిఁడిచౌడయ యనుముందటిపేర - యెసఁగుఁబో జగముల [5]నెట్లును నింక”
ననుచుఁద్రస్తరు లాడుచును సంతసమునఁ - జనుదేరఁగల్యాణమున[6]కు సంప్రీతి
యెసకమెక్కఁగ సంగమేశ్వరునంద - బసవన్న సౌడయ్య భావంబు గాంచి
చక్కన నెదురేఁగి జగతీతలమునఁ - జక్కఁ జాఁగిలఁబడి మ్రొక్కి తోడ్తెచ్చి
యుచితోపచారనియుక్తిఁ గావించి - యచలాత్ము ముసిఁడిచౌడయ్య నే ప్రొద్దు
సంగమేశ్వరునంద సద్భక్తిక్రియలు - భంగిగాఁగొలుచు[7]చు బసవయ్య సలుప
నసమానలీలఁగళ్యాణంబునందు - ముసిఁడిచౌడయమహోల్లసనప్రయుక్తి
నెడపక సద్భక్తి కెల్లయై యిట్లు - నడుచుచు మఱియొక్కనాఁడుత్సవమున
నార్యులు దీవించియనుప వివాహ - కార్యార్థమై యరుగంగఁగట్టెదురఁ
గటకంబు రాజమార్గంబునఁజెలఁగి - నటియించు భక్తగణంబులనడుమ
ఘనవిమానస్థుఁడై గగనమార్గమునఁ - జనుదెంచు తవరాజుశవము వీక్షించి
“వావిరి తవరాజవల్లభుచేత - దీవెన లందకపోవంగఁ దగునె?
పరిణయంబున కిత్తపస్వి యేతేర - కరిగెడువాఁడఁ గా నటు నిలుఁడనుచు
నలుఁగుమోహణమున హస్తంబు దొడిగి - జళిపించి మొనసూపి నలిరేఁగి యార్చి

  1. పడిన
  2. తదీయా
  3. కుండల
  4. నర్పితంబనుచు
  5. నెల్లను
  6. లసద్వృత్తి
  7. డు భక్తులుగొలువ