పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

149

దగిలి గిల్కయు దక్షుతలకొమ్మువోలెఁ - దగరుకొమ్మునుబట్టి తనవేష మమరఁ
గోరి త్రివిక్రము కోలెమ్మువోలె - సారంగ నొక గుదియయుఁజేతఁబట్టి
కలకేత వేష మింపలరంగఁదాల్చి - నలువొప్ప భక్తుల నగళులకేగి
“పరసమయంబులఁబొరిమాల్పఁదాఁకు - ధరరుద్రు నిటలాగ్ని తగ[1]రేఁగు దెంచె
జినదర్శనంబులఁజిఱ్ఱు ముఱ్ఱాడు - మన వీరభద్రుని మదకరివచ్చె
నిమ్మహిభక్తుల యిలువిందు నచ్చె - నమ్మహాప్రమథచయము [2]ముద్దు వచ్చె
దుగళవ్వగారి సుతుం డేఁగుదెంచె - మొగి సంగళవ్వ తమ్ముఁడు వీఁడె వచ్చె
నమ్మలా! రక్కలా” రని నగించుచును - నిమ్ముల నిత్యంబు నిరుసయుఁగొల్చు
కొనివచ్చి జంగమకోటి కత్యర్థి - ననయంబుఁబరిచర్య లాచరింపుచును
సన్నుతభక్తి సమున్నతలీల - నున్నెడ నియతిమై నొక్కభక్తుండు
భాతిగాఁగిన్నర బ్రహ్మయ్యఁ జూడ - నేతెంచి యేతెంచి యేఁగఁజాలమిని
గలకేత బ్రహ్మయ్యగారి సన్నిధిని - నలసి పథిశ్రాంతుఁడై పడియున్న
“డస్సి శరీరంబు గ్రుస్సి పాదములు - వ్రస్సి యెంతయును శ్రవంపడి యిట్లు
చనుదేర నీకింతవని [3]గలదయ్య!” - అనవుడు నాయయ్య యంత వీక్షించి
“నంబి కీశుఁడు దొల్లి నలిఁబడివెట్టు - నింబుగా జనులెల్ల నెఱుఁగఁగ నిపుడు
పడివెట్టుఁ గిన్నర బ్రహ్మయ్యగారి - కెడపక యని నరు ల్బుడిబుళ్లు వోవ
విని చూడవచ్చితి వినవె దారిద్ర్య - ఘనదుఃఖ మార్చునో యనుబుద్ధిఁజేసి
వంతయు గింతయు వట్రిల్లె నిచటి - కెంతద వ్వట చెప్పవే యయ్య మఠము
చనియెద నా యయ్యఁగనుఁగొన్నఁ గాని - తన [4]దప్పివో” దని తథ్యంబు వలుక
“నిప్పాట నది యొక్కయెప్పుగా నతనిఁ - జెప్పకు సెప్పకు నేకూలి గాని
పని వెలఁగొని చేయుబంట్లకు రాశి - గొనవచ్చునే తన కూలియే తక్క
ఫలములు గుఱుతిడు భక్తుల కెట్టు - లలవడు లింగనిరంతరసుఖము
పదవులు గిదవులు వళ్లును గిళ్లు - మదనారి సద్భక్తమండలి కరుదె?
యంతద వ్వింక నెట్లరిగెదు డస్సి - యెంత యర్థంబైన నెత్తికొ”మ్మనుచు
నడరఁ [5]జేగుదియయు [6]రాలప్రోకఁ - దడయ కొండొంటితోఁ దాఁకింపఁ దడవ
తంగెడుపూవులు ధరణిఁ బ్రోవిడ్డ - భంగి నర్ధంబున్నఁ బైచీర గప్పి
కనుఁగవ హర్షాశ్రుకణములు వెల్లి - గొన నర్థి మోపెత్తికొనుచు భక్తుండు
వలివేగమున వచ్చి వచ్చి యెంతేని - బలువిడిఁజక్కన బసవనమంత్రి

  1. నే
  2. ముందు
  3. గల్గెనయ్య
  4. దృష్టివో
  5. దృష్టివో
  6. రాలువీఁక