పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

147

మున్ను బాపూరిబ్రహ్మన్నకుఁబలికి - జొన్నలు నీవయై యున్న శంకరుఁడ!
పలుకవే నాబారిఁబాఱి” తన్నట్టు - లలుఁగుమోహణమున హస్తంబు దొడిగి
కిన్నరబ్రహ్మయ్య సెన్ను [1]దుల్కాడఁ - బన్నగధరుమహాభక్తులఁదలఁచి
యాయతి నభిముఖుండై "త్రిపురాంత - కా”యని పిలుచుడు "నో[2]" యనుచుండె
బిట్టుల్కి మూర్ఛిల్లి [3]బిమ్మిటిఁ బొంది - నెట్టోడి లింగ సన్నిహితులు దక్క
ఖగమృగోరగ నరకరితురగాదు - లగు సమస్తచరాచరాది జంతువులు
నుక్కఱి మ్రగ్గి యట్లున్నవియున్న - చక్కటిఁ బ్రాణము లక్కున విడిచె
నాకటకం బిట యట కానఁబడియె - లోకంబులెల్లఁగల్లోలంబు నొందె
నీక్షితి గంపించె నినుఁడస్తమించె - నక్షత్రములు డుల్లె నగములు ద్రెళ్లె
నంబుధు లింకెఁ గూర్మంబుఁ దలంకె - నంబరంబిల మ్రొగ్గె నహిపతి స్రగ్గె
ననిలుండు దొలఁగె స్వాహాపతి మలఁగె - వనజనాభుఁ డులికె వనజజుఁ డలికె
సమసుప్తిఁ బొందించి జగములఁ ద్రుంచి - ప్రమథులు లోకముల్ దమమయంబుగను
నాడుచుఁ బాడుచు నసమానలీలఁ - [4]గ్రీడింప మఱియు సత్రియ [5]దులుకాడ
నవికలానేకభక్తావళి వేర్చి - సవిశేషగతి మహోత్సవములు సలుప
బాయక రేయును బగలును గూడ - మ్రోయంగ నేడ్దినంబులు సన్న పిదప
భువనోపకారార్థబుద్ధిమై బసవఁ - డవిరళగతిఁగిన్నరన్నకు మ్రొక్కి
"సజ్జనశృంగార! సత్యగంభీర! - యిజ్జగదాధార! యీశ్వరాకార!
మంగళగుణధామ! మహిమాభిరామ! - లింగాభిరూప! యభంగప్రతాప!
నిర్జితాహంకార! నిఖిలోపకార! - దుర్జనదూర! విధూతసంసార!
కారుణ్యపాత్ర! యకల్మషగాత్ర! - వీరవ్రతాచార్య! విపరీతశౌర్య!
యంచితాగణ్య నిరంతరపుణ్య! - సంచితసుఖలీల! శరణవిలోల!
సన్నుతకీర్తి! సాక్షాద్రుద్రమూర్తి! - కిన్నరబ్రహ్మయ్య! కృపసేయు” మనిన
బసవయ్యచే[6] వ్రేసిప్రహసితుండగచు - నసమాక్షుఁజూచి హే'[7]యనుచువారింపఁ
దొల్లిటియట్ల యద్భుతలీల నడరె - నెల్లలోకములు మహిష్ఠతఁబరగెఁ
గటకంబుసూడ నెప్పటియట్ల ప్రబలె - నిట చరాచరజీవు లెల్లను బ్రదికె
బిజ్జలుఁడంతలో బిమ్మటి దెలిసి - యజ్జనౌఘముఁదాను సాష్టాంగ మెరఁగి
“యభయమే జియ్య! యత్యద్భుతకీర్తి! - యభయమే దేవ! మహామహిమాఢ్య!

  1. దొల్కాడఁ
  2. యనిపలుక
  3. బిమ్మట(టి)
  4. గ్రీడింపుచుండ
  5. దోఁపమఱియు
  6. భక్తిఁ బ్రణమి
  7. యని నివారింప