పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

బసవపురాణము

భక్తులకేన చూ ప్రాణంబు నాకు - భక్తుల దేహంబు పరమార్థ మిదియు
మద్భక్తసేవయ మత్పాదసేవ - మద్భక్తదేహంబు మాదుదేహంబు
మద్భక్తవినుతియ మద్గుణవినుతి - మద్భక్తనిందయే మత్తత్త్వనింద
సన్నుతలీల మా జంగమావలిని - మన్నింపకున్నను మతి నిష్ఫలంబు
శంభు పూజనముదా “[1]స్థావరేనిష్ఫ - లం భవే” త్తని శ్రుతు ల్చాటెడిఁ [2]గాదె!
భక్తైకదేహుండ భక్తవత్సలుఁడ - భక్తసత్ప్రాణుండ భక్తాశ్రితుండ
భక్తపరాధీనయుక్తుండ నటు - భక్తికేఁగూర్చుట ప్రఖ్యాతి గాదె

బాణుని కథ


ఎట్టన్న! వీరమాహేశ్వరభక్తి - నెట్టణ గలుగు వినిశ్చలాత్మకుఁడు
బాణుండు నాఁగ సద్భక్తి క్రియాధు - రీణుండు లింగమూర్తికి సాంగముగను
వేయుమాఱులు నిత్యవిధి నేమముగను - బాయక పూజలుసేయుచునుండ
దేహధర్మములకుఁదెఱపి లేకున్న - బాహుసహస్రంబు బాణున కిచ్చి
యది యొక్కమాఱు వేయవసరంబులను - సదమలభక్తిమైఁజలుపఁజేసినను
బాణునకును మెచ్చి బాహుసహస్ర - మేణాంకధరుఁడిప్పుడిచ్చెఁదా” ననుచు
సందర్శనాసక్తిఁజనుదెంచుభక్త - సందోహశివకథాసంగతినుండ
“నటమున్న చేయులింగార్చనలకును - నిట యెడలేకున్న [3]నెట్లోకో” యనుచు
సడిసను లింగావసరములు సేసి - తొడఁగి ప్రసాదంబుఁగుడుచునంతకును
వారించి చొరనీక వాఁకిట నిలిచి - యేరికైనను [4]నేన యిల గోష్ఠి యిచ్చి
వాకిటి కాపులవాఁడనై యతని - వాకిలి గావనే లోక మెఱుంగ

పిట్టవ్వ కథ


వెండియు నమ్ముదిగొండ యన్పురిని - దండియై కరికాలమండలేశ్వరుఁడు
కావేరి గట్టింపఁగడఁగి యిల్లాది - వోవ 'నీకై యేను వోయెద' నంచుఁ
బిట్టవ్వ భక్తికిఁబ్రియపడి కాదె - వెట్టికిఁజనుటెల్ల విను మట్లుఁగాక

కలికామదేవుని కథ


నిత్యార్థమగు స్వామిభృత్యసంబంధ - కృత్యసద్భావనక్రియ దులుకాడ
నక్కటా! స్వామిదివ్యాంఘ్రికంజంబు - లొక్కింతయును గందునో యనకిట్లు

  1. స్థావరం
  2. గాన
  3. నెట్లకో
  4. నేఁగ నిల