పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

131

మల్లికా విద్రుమ మాధవీ ద్రాక్ష - వల్లరీవేల్లన సల్లీలఁదనరి
లలితతదీయ కిసలయ ప్రసూన - ఫలమంజరుల ప్రభఁబ్రజ్వరిల్లుచును
బంబి పున్నాగరంభాపరివేష్టి - తంబగు సంతానధరణీరుహంబు
పొడఁగని ముందట [1]గుడియకాఁదలఁచి - యడుగెత్త కతిసంశయాత్ముఁడై చూచి
యీ వనమధ్యమందిది యొక్కగుడియొ? - కావింపఁబడియున్న ఘనకల్పతరువొ?
ఈతరుశాఖల హేమకుంభములొ? భాతి విద్రుమలతాప్రసవ మంజరులొ?
ఈ మంజరులలోన నిదిరత్నపంక్తి - యో మల్లికాతతియో! పుష్పతతియొ?
ఈ పుష్పపంక్తి మాకెనయుఁగాదనుచు - నేపారి యిట్లున్న యెలమి వేష్టించి
మ్రాకుగట్టినయట్టి మానంపుగుడియొ? - ప్రాకటపుష్ప విస్ఫార గుల్మములొ?
ఈ గుల్మమధ్య మహీజరాజునకు - బాగొందఁజల్లని పవనంబు నొసఁగఁ
జాలుపచ్చని పట్టునాలవట్టములొ? - క్రాలుచునున్నట్టి కదళీదళములొ?
ఈ కదళీదళానీకంబు సుట్టి - ప్రాకారములలీలఁబ్రజ్వరిల్లెడిని
వినుతికెక్కన కల్పవృక్షంబ యిదియు - ననుమాన మొక్కింతయును [2]వలదనుచు
శీతలంబై కడుఁజెన్నొందుచున్న - యాతరుచ్ఛాయ కట్లల్లన యేఁగి
భువి ని[3]పతితపుష్పములు గద్దెగాఁగ - శివుఁడు సుఖాసనాసీనుఁడై యంత
నెగయు నిట్టూర్పులు నిగుడఁగ ఱొమ్ము - నిగుడించుకొని నంబిమొగముఁజూచుచును
సంగతానన ఘర్మజలములు గరత - లాంగుళంబులఁబుచ్చి యవలవైచుచును
నలిఁగదళీదళచలన సంకలిత - మలయానిలమునకు మనసువెట్టుచును
నానావిధానేక నవపుష్పపరిమ - ళానూనవాసన కాత్మఁ [4]జొక్కుచును
ఘనసారచందనక్ష్మాజ సౌరభము - తనువు(పు?) సంగతికిడెందంబు నొగ్గుచును
బరిమళాహృత భృంగపక్షోపనిహతిఁ - దొరుగు పుప్పొడికిని శిరము సాఁపుచును
హిమకరశేఖరుఁడమృతాంగుఁడిట్లు - గమనోపతాపోపశమము వహింప
నొయ్యనొయ్యన నంబి కున్మదం బడఁగ - నయ్యెడ భక్తి భయం బాత్మఁదొడఁగ
“నయ్యా! ఇదేమయ్య! జియ్య! నీయట్టి - యయ్యకు నిట్టి భయం బాత్మఁదోఁచు
టింతవట్రిల్లు టిదే[5]మొకో?” యనిన - నంత వాల్మీకేశుఁడతని కిట్లనియె

వాల్మీకేశుఁడు శివభక్తుల మహిమ నొడయనంబికిఁ జెప్పుట


“నవికలవేద వేదాంతపురాణ - వివిధ శాస్త్రార్థ సంవిత్ప్రమాణముల
మాకును మద్భక్తమండలికిని వి - వేకింపఁగా నెద్ది వేఱుభేదంబు?

  1. గుడిగాఁ దలంచి
  2. వల్వదనుచు
  3. నిపతితమైన పువ్వులగద్దె
  4. జొన్పుచును
  5. మకో?