పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

71

మీఁదువో [1]యినవనో మీఁగడ లేదొ? - దెచ్చునెడ నెవ్వరేఁజూచిరనియొ?
యూరకేమిటికిఁ బాలొల్లవు ద్రావఁ - గారణంబేమేనిఁ గలదేనిఁ జెపుమ
నిక్కంపుటాఁకలి నీకు లేదేని - గుక్కెఁడైనను గొని [2]చిక్కించు నాకుఁ
[3]గుడుపునకియ్యెడ [4]గుడగుడ లేల - కుడికెఁడు దెత్తు నా గుజ్జునోగిరము
మూలపన్నారుల యాలోవిలోనఁ - బోలె లున్నవి వంపు వోయి తెచ్చెదను
ఉట్టిపై బానలో నున్నది నెయ్యి - యిట్టున్నఁ దెచ్చెద నిష్టమే చెపుమ
కుండెఁడున్నది వోయి కొనివత్తుఁ బుల్ల - [5]కండంబు వలెనేని గ్రక్కునఁజెపుమ
[6]అచ్చన యెల్లి మాయయగారినగరఁ - జెచ్చెరఁ బిల్వవచ్చెద నారగింపు
మా శివసోదరిమఠమునఁగలదు - పాసెంబు దెచ్చెదఁబాలు మున్త్రావు
షోడశపండువు సూడఁబోదండు(?) - పోఁడిగా నీ పాలు పురహర! కొనుము
వీరభద్రుని జాత్రవేళ [7]నిన్బండి - యే రొప్పఁ బనిచెద నీ పాలు ద్రావు
మెడమడు గేమిటి కీ పాలలోని - కడుకులు దెచ్చెద నల్లైనఁ జెపుమ
యిత్తఱి శిశువుండ నెట్టులంటేని - పొత్తుననైనను నెత్తి త్రావుదము
పిన్నపన్నారులు సిన్నిబొమ్మలును - నిన్ని గూడడుకులు నెన్నేనిఁబండ్లు
నా కెల్లి మా వారు నలిఁ దెత్తురపుడు - నీకు నిచ్చెదఁగాని నీ యాన! త్రావు
పాలును జల్లారెఁ బలుకవు దోడ - నేల యాలింగ! నన్నేఁచెద వనుచుఁ
బాప యీశ్వరునకుఁ బలుమాఱు మ్రొక్కుఁ - గోపించు భంగించుఁ గుప్పించు నఱచుఁ
గటకట వాపోవుఁగరము[8]లు విఱుచుఁ - దటతట నేలతోఁదాఁకించుఁగాళ్లు
ధారుణిఁబడి బయల్దన్నుచు నేడ్చుఁ - గోరదిక్కును జూచు మారారిఁజూచు
బుజ్జగించును [9]వెడ్లు బుడ్లును బెట్టు - నిర్జీవిక్రియఁబడు నివ్వెఱఁగందు
నెప్పటి య ట్లేడ్చు నెలుఁగెత్తి పిలుచుఁ - దొప్పనఁ బడుఁ గోరఁ దొలఁగంగ [10]నూకు
వెఱచి ముందఱఁబెట్టు మఱి పలుమాఱు - నెఱఁగుఁ [11]బాదంబుల కెట్లుఁ ద్రావమిని
[12]నిట్టైనఁగాని పాలేఁ ద్రావ ననవు - ముట్టవు మూర్కొనవట్టె యున్నవియు
నీవారగింపమి మా వారు విన్నఁ - జావనడ్తురు నన్ను సంశయంబేల
తనకు నెప్పుడుఁ జావు దప్పదు[13] మగిడి - చన నిచ్చటనె చత్తు సరివోదు” ననుచుఁ
దనతల శివునితోఁ దాఁకించుకొనఁగఁ - జనునంతలోనన [14]చక్కనఁబట్టి

  1. యిన? (యనొ)మరి.
  2. చిక్కింపు
  3. కుడుపున కెయిదదేఁ గుడువలేననియె
  4. గుదగుద
  5. ఖండంబు
  6. అర్చన
  7. నీ బండి
  8. దాటించుఁ
  9. వెళ్లుబుళ్లును బెట్టిఁ
  10. బెట్టు
  11. బాదములకు నెట్టుఁ
  12. నెట్లైన
  13. మగుడి
  14. చక్కటఁ