పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

బసవపురాణము

యా రుద్రుఁడతిదయాహసితాస్యుఁ డగుచుఁ - గోరతోఁ బాలెత్తుకొని యారగింప
“నన్నింత యేఁచితి పిన్నగాఁ[1]జేసి - మిన్నకపోదు మాయన్నకుఁజెప్పి
మఱికదా యున్నది మాట[2]లింకేల - కఱకంఠ! యింతయు మఱవకు”మనుచుఁ
గుడుక దెమ్మని పుచ్చుకొనుచు నబ్బాల - వడిగొని యింటికి వచ్చి నిత్యమ్ము
నిట్ల కొంపోయి తానిచ్చుచునుండ - నట్ల శివుండుఁబాలారగింపంగ
నూరికిఁబోయిన వారెదుర్గాఁగఁ - దా రేఁగుదెంచు నత్తఱిఁదొంటియట్ల
మృడుఁడు వాలారగిం[3]చుడు బాల రిత్త - కుడుకఁ [4]జేతను బట్టికొని యేఁగుదేరఁ
బొడగన 'యిట యెందుఁ [5]బోయెదు రిత్త - కుడుక యెచ్చటనుండి కొనివచ్చె'దనిన
'మీరు సెప్పినయట్ల మృడునకుఁబాలు - కోరతోఁ గుంచెఁడు గొలిచి కొంపోవ
నారగింపఁగ మ్రొక్కి యనయంబు నిట్లు - కోర యిమ్మన పుచ్చికొని వత్తు'ననిన
“నేనాఁటఁ ద్రావుఁ బాలీశుండు వడుచ - కానీవ త్రావితో కాదేని తోడ
నాడెడు పడుచుల కచటఁ[6] బోసితివొ? - యేడఁ [7]జల్లితివొ [8]మైయెఱుఁగవు గాక
తన్నుమహాభక్తతతి [9]యుద్దెసించి - పన్నుగా 'నారగింపవె దేవ!' యనుచు
నతిభక్తిఁ బ్రార్ధింప నారగించుటయు - క్షితి దుర్లభంబన్న నితరులతరమె?
యెట్టు నమ్మెడి దంచుఁబట్టిఁదిట్టుచును - 'నట్టెనఁజూత'మం చామఱునాఁడు
బాలచేతనె తండ్రి వట్టించుకొనుచు - లీలతోఁగుడికేఁగి పాలతోఁ గోర
ముంద[10]ఱిక్రమమున ముంద[11]ఱనఁ బెట్ట - నందికొనండయ్యె నా లింగమూర్తి
బాలముగ్ధత్వంబు ప్రవిమలభక్తి - [12]యీలోకమున వెలయింపంగఁ దలఁచి
యా శివదేవుఁడు నంతఁ గోపించి - [13]యోసి! నేఁడేల పాలొల్లండు ద్రావ
ముక్కంటిముట్టెనే [14]మూర్కొన్నె చెపుమ - పెక్కులు వ్రేలితి [15]వక్కజంబుగను
శివునకు నని యుద్దెసించినపాలు - దవిలి నిత్యంబును ద్రావినద్రోహి!
పొట్టవ్రచ్చెద[16] నెందుఁ బోయెద'వనుచు - గట్టుగ్రమునఁగూడ [17]ముట్టుడు మున్న
బాల వాపోవుచు బలువిడినేఁగి - [18]హాలింగ! హాలింగ! హాలింగ! యనుచు

  1. జూచి
  2. మాటలేలిఁకను
  3. పుడు
  4. దాఁజేఁబట్టుకొనుచు నేతేర
  5. బోయితి కొన్ని ప్రతులలో 'యెందువోయెదు' అని కలదు. 'ఎందు, అందు, ఇందులు' ప్రథమాంతముగాఁ గళగాఁజెప్పదగియున్నవి
  6. నిచ్చితివొ
  7. జల్లితొదేహ
  8. మైయెఱుఁ , మెయ్యెఱుఁ,
  9. యుద్దెశించి
  10. టి
  11. యీ లోకులకు
  12. యోశి!
  13. ఇక్కడ 'మూర్కొన్నె మూర్కొనెనె, అనునర్థమునఁ గలదు. “ముట్టునేమూర్కొన్నె” అని యెక్క ప్రతిలోనున్నది. మఱియుఁ గొన్నింట “మూర్కొనెనె' అని గణభంగముగాఁగలదు.
  14. ప్రేలరిపడుచ
  15. నెందువోయెద
  16. ముట్టెడు
  17. హాలింగ! హాలింగ! యనుచుడగ్గఱుడు.