పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

బసవపురాణము



నీవు నిరోగివై నిత్యుండవై సు - ఖావాప్తి [1] నుండు నాకంతియె చాలు
కన్న మోహంబునకంటె నగ్గలము - ఎన్నఁ బెంచినమోహమెందు నటండ్రు
అటుగాన నినుఁ గన్నులారం జూచుచును - నిట యుండుటయె నాకు నీప్సితంబనిన
మందస్మితముఖారవిందుఁడై తల్లి - నందంద కౌఁగిట నప్పళింపుచును
'ముల్లోకములకెల్ల ముత్తవ(త్తోవునా?) నాకుఁ - దల్లివిగాన నా తల్లి! నీయట్టి
తల్లి[2]వి గలుగంగఁ దనకు రోగంబు - లెల్లెడఁబొందఁగ నెట్లుండవచ్చు'
ననుచు నిత్యత్వ మాయమ్మకు నొసఁగె - ననుపమ పరమ పరానందమూర్తి
యమ్మయై శివుఁ గొనియాడుటఁ జేసి - యమ్మవ్వ యను నామమయ్యె వెండియును

గొడగూచి కథ


“శివుదేవుఁడన నొక్క శివభక్తి[3]యుతుఁడు - నువిదయుఁ [4]దానుఁ బొర్గూరి కేఁగుచును
రూపించి [5]కడగొట్టు పాపఁదారింటి - కాపిడి 'యటయిట కదలకుమమ్మ!
పడుచులతో నాడఁ బఱవకు మమ్మ! - నొడివిన మా వ్రతం బెడపకుమమ్మ!
గుడి కేఁగి నిత్యంబుఁ గుంచెఁడుపాలు - బడరున కారగింపఁగఁ బెట్టుమమ్మ!
నమ్మిపోయెదము సుమ్మమ్మ! మఱాకు - మమ్మ! మా యమ్మ! మాయక్క! మా తల్లి
కొమ్మ! నీకొక [6]మంచిబొమ్మయు లెస్స - బొమ్మపొత్తికలును బోయి తెచ్చెదము”
అని యప్పగించుచు నరిగిన, వారి - తనయ గాళ్లు మొగంబు దాఁ గడిగికొని
మంచిగంగులపాలు [7]మరగంగఁ గాఁచి - కుంచెఁడు గోరతోఁ గొలిచి చేపట్టి
కోరయు [8]బొత్తిస(?) కొంగునఁ గప్పి - భోరునఁ జని శివాగారంబుఁ జొచ్చి
కోర ముందఱఁ బెట్టి ధారుణిమ్రొక్కి - "యారగింపవె దేవ!” యని విన్నవించి యా
పిఱుసని యొక్కింత మఱువున నిలిచి - మతి వచ్చి చూచుడు గఱిగంటి గామి
బాల దల్లడమంది భయమునఁబొంది - పాలేల యారగింపవు లింగమూర్తి?
కాఁచుట సాలదో కమ్మ వల్వమినొ- ప్రాఁచియో విఱిగెనో పడుచ నేననియొ?
ప్రొద్దెక్కెనో [9]యొంద [10]బొగయువల్చెడినొ? బుద్ధివుట్టదొ నెయ్యివోయకుండితినొ?
కడువేఁడియో నీరు గలసినవనియొ? - ఎడ వాద్యములు లేక యేనె తెచ్చిననొ?
చాలవో యివి యాలపాలు గావనియొ? - పాలపైఁ జిత్త మేఁబఱపితి ననియొ?
కోర బెడంగనో [11]కుంచెఁడు లేవొ? - ఆరగింపఁగఁ బెట్ట నేరకుండితినో?

  1. నుండ
  2. యునుండంగఁ
  3. పరుఁడు
  4. దా బొరుగూరి(బొన్నూరి)
  5. కడఁబుట్టు
  6. చిన్న
  7. మరలంగఁ
  8. బొత్తిన; బొప్పెన
  9. యెండపొడ
  10. బొగవట్టిచెడెనొ
  11. అన్ని ప్రతుల నిట్లే కలదు.