పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

69

'వెడయాట లివి [1]యెల్ల వేగి యాడినను - గడుపు నిండునె' య[2]ని గ్రక్కునవచ్చి
పిట్టవ్వకై రాచవెట్టికిఁ బోయి - యెట్టకేలకు నింత పిట్టారగించి
సామవేదులయింటఁ జచ్చినపెయ్యఁ - బ్రేమం[3]బుతో వండి పెట్టంగఁ గుడిచి
[4]కామింపఁగాఁ గరికాళవ్వయింట - మామిడిపండులు మఱుఁగున నమలి
పోయి చెన్నయయింటిఁబులియంబకళముఁ - జేయుఁ దీయక జుఱ్ఱి చిఱుతొండనంబి
కొడుకు [5]మాంసము వేఁడికొని [6]విందుసేసి - యెడపక నిమ్మవ్వయింట భుజించి
యారగింపఁగఁ జవియైనఁ జోడవ్వ - కోరతో నిచ్చినఁ గొని యారగించి
యాసక్తి సురియచౌడ[7]య్య చేకళ్ల - కాసించి తట వెండి యంతటఁబోక
నిన్న నింతయు నొక్క నొలఁతుక సెప్పెఁ - గున్న! యాఱడి [8]వుచ్చఁగూడునే నన్ను
మలమల మఱుఁగుచు నిలనాడనేల - కొలఁదిదప్పినకుడ్పు గుడువంగనేల?
బ్రదుకున్నదే యిట్లు వైకుడ్పులందు - నది యేల కడుపూఁదదయ్యెడుఁ జెపుమ
చన్నిత్తుఁ బలుమాఱు వెన్నయుఁ బాలు - నెన్నఁడుఁ దప్పింప నెందైనఁ దెత్తుఁ
[9]గుడుపు నీ కెయిదదే కొడుక యిట్లేల? - అడిగి కుడువఁబోయి తాదట [10]లేక
యిన్ని దినంబులు [11]నేరీతిఁ జాలె - నిన్న నీ కడు పేల నిండదు సెపుమ
యేయెడ వంచింప 'రేయును బగలుఁ - జేయి దిగం డిట్టిసితగుండు గలఁడె?”
యని యొండె వేసర నాసరఁగన్న - జననిగదా యని [12]చనవునఁ బలుకఁ
దెల్ల మిప్పుడు మీఁదఁ దొల్లి నా యట్టి - తల్లులు గలరె యీ ముల్లోకములను
బనుగొన నీవు నా ప్రాణంబు [13]గాఁగ - [14]ననురక్తి గొనియాటకది నీవె సాక్షి
[15]యెట్టేని మాయుంచినట్టుల యుండి - బెట్టినంత గుడిచి యట్టుండితేని
యెప్పాట నినుఁ బొందునే తెవుల్నొప్పి? - నిప్పునఁ జెదలంటునే నీకు నీవ
చేసికొనఁగఁ దెవుల్సిద్ధించెఁగాక - యీ సంకటంబు నీ కేల [16]తావచ్చుఁ
బనియేమి? మాటలఁ బాయునే తెవులు - నినుఁ [17]గొంత వీఱిఁడితనమడ్గనేల?
[18]చాలఁ జూడంగ నీ సంకటం బింక - బాలుండ! నీ మీఁదఁ బ్రాణము ల్విడుతు”
నని తనశిరమున కలు[19]గ నున్నంతఁ - దన తల్లి కపుడు ప్రత్యక్షమై నిలిచి
యడుగు మిచ్చెద నీకు నభిమతం బనుడుఁ - గొడుక! నా కొకకోర్కికొఱఁతయుఁ గలదె?

  1. వెల్లివేఁగినాడినను
  2. యంచుఁగ్రమ్మఱ
  3. మీఱఁగఁజేసి
  4. కామించియాకరి
  5. మాంస మడిగి
  6. యెత్తుచేసి
  7. డనిచేతకళ్లఁ
  8. ఁబుచ్చ
  9. కుడుపు నీ కిందదే
  10. బోక; మఱియు
  11. నీది యెట్లు
  12. చదువున
  13. గాన
  14. ననుషక్తి
  15. వట్టేలయట్టేని
  16. రా
  17. గ్రొత్త... మడుగుదురె
  18. చాలుఁ
  19. గంగనంత