పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

బసవపురాణము

ఉగ్గులు [1]వోసియు నువిద సంప్రీతి - నగ్గించు నొగియించు నట బుజ్జగించు
ముద్దాడు నగియించు ముద్దులువేఁడు - నద్దికొన్ వీరెవ్వరయ్యరో యనుచుఁ
బన్నుగా నుదరంబుఁ బాన్పుగాఁజేసి - [2]కున్న జోసఱచుచు సన్నుతిఁబాడుఁ”
గొడుకని [3]యిబ్బంగిఁ గొనియాడుచుండఁ - బడఁతి నిశ్చలముగ్ధభావంబునకును
శివుఁడును మెచ్చి తాఁ జేకొనియుండె - నువిద గావించు బాల్యోపచారములు
శ్రుతి “యేకయేవహి రూపేణ”యనియు - స్మృతి “సాధకస్సంస్మరేత్సదా” యనియు
ధర “తస్య తన్మయతాంయాతి” యనియు - హరునివాక్యము గాన యది యేలతప్పు
భక్తుఁ డెబ్భందిగా భావించు శివుఁడు - వ్యక్తిగాఁ దద్రూపుఁడై యుండు టరుదె?
యని భక్తమండలి [4]వినుతింపఁ గొన్ని - దినములు సనఁగ నద్దేవదేవుండు
వెండి యమ్మకుఁ బ్రసన్నుండు గాఁదలఁచి - దండిరోగంబైన [5]తఱుచంటిక్రియను
జన్నును గుడువక సంధిల్ల నోరు - వెన్నకుఁ దెఱవకయున్న యక్షణమ
బిట్టుల్కిపడి [6]తల్లి బిమ్మిటి నొడలుఁ - బట్టలే కాపద గిట్టి “నాయన్న!
నాకున్న! నా పట్టి! నా [7]చిన్నవడుగ! - నా కుఱ్ఱ! చన్నేలరా కుడ్వవైతి
నీ చెమటయుఁ జూచి నెత్తురు [8]నవుదు(?) - నో చెల్ల! [9]యెటు సూడనోపుదునన్న!
తల్లిఁగదన్న! యింతటి కోర్తునన్న! ఎల్లెడ నొరుల నే నెఱుఁగఁగదన్న!
[10]కలిగితి లేక యొక్కఁడవు గదన్న! - తలరక యే నెట్లు ధరియింతునన్న!
నేలపై [11]నా కాళ్లు నిలువవురన్న! - ఏల పల్కవు సెప్పవే యన్న! నీకు
నఱిమియో? [12]కోవయో? [13]యంగిటిముల్లొ! - ఎఱుఁగను మందుమ్రా కేమియు” ననుచు
[14]బనవుఁ బలవరించుఁ బయిబడి పొరలుఁ - గనుఁగొను మైవుడ్కుఁ గౌఁగిటఁ జేర్చుఁ
గప్పుఁ దెఱుచుఁ గప్పుఁ గ్రమ్మఱఁ దెఱుచుఁ - దప్పక వీక్షించుఁ దల్లడంబందుఁ
బొంగెడుఁగడుపుముప్పునను 'బొప్పనికి - నంగిటిముల్లయ్యె'నని నరులనఁగ
నడలుచుఁ గడుశోకజడధిఁ దేలుచును - బడఁతి పుత్త్రుండున్నభావంబుఁ జూచి
కడుపు వెలితియైన నొడయనంబికిని - నెడవోయి [15]యచ్చటఁ గుడువ లేకున్నఁ
గునియుచుఁ గుమ్మరగుండయ్య వాద్య - మున కాడి యచ్చటఁగొనఁదిన లేక
వచ్చి చేరమ చక్రవర్తి వాయింప - నచ్చెరువుగ నాడి యాఁకట [16]బడలి

  1. వెట్టియు
  2. కున్ననిఁ జఱచుదు
  3. యుబ్బుచుఁ
  4. హర్షింపఁ
  5. తఱిచంటి
  6. మూర్ఛబిమ్మిట
  7. చిన్ని
  8. నవుదు
  9. యిటు
  10. కలిగియులేకయె
  11. గాళ్లును
  12. కొదమయో
  13. యంగుటి; యంగుడు
  14. బనువు
  15. యటకొనఁ
  16. డస్సి